అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో తన సినీ అభిరుచులను పంచుకోవడం అభిమానులను ఎంతో ఆశ్చర్యపరిచింది. టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని కోహ్లీ పేర్కొన్నారు. హైదరాబాద్(Hyderabad)లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కోహ్లీ, ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘జూనియర్ ఎన్టీఆర్ నటనకు, వ్యక్తిత్వానికి నేను పూర్తిగా ఫిదా అయ్యాను. ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఓ రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో తొలిసారి కలిశాక మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది” అని చెప్పాడు.
Virat Kohli | కోహ్లీ స్టన్నింగ్ కామెంట్స్..
‘RRR’ సినిమాలోని నాటు నాటు పాట(Natu Natu Song)కి ఆస్కార్ అందుకోవడం భారతీయ సినిమా గర్వకారణంగా అభివర్ణించిన కోహ్లీ, ఈ పాటకు ఓ మ్యాచ్ సమయంలో స్టెప్పులేసిన వీడియో గతంలో వైరల్ అయింది. అంతేగాక, తెలుగు సినిమాలపై ఆసక్తి ఉంటుందని, సమయం దొరికినప్పుడల్లా చూసే ప్రయత్నం చేస్తానని, పాటలు అయితే రెగ్యులర్‌గా వింటానని తెలిపారు. ఇంతకుముందు ఓ తమిళ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో తమిళ హీరో శింబు అంటే కూడా ఇష్టమని వెల్లడించిన కోహ్లీ(Virat Kohli), దక్షిణాది సినిమాలపై తనకున్న ఆసక్తిని మరోసారి చాటాడు.
విరాట్ కోహ్లీ టీ 20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఐపీఎల్ 2025 తర్వాత పూర్తి స్థాయిలో బ్రేక్ తీసుకున్న ఆయన ప్రస్తుతం లండన్ లో కుటుంబంతో గడుపుతున్నాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌తో కోహ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన వార్ 2 సినిమా ఇటీవల విడుదల కాగా, ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఫలితం నిరాశపరిచిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగు మార్కెట్‌లో కూడా కలెక్షన్ల పరంగా పెద్దగా లాభాలు రానట్టు సమాచారం.