అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price on August 30 : భారతీయుల జీవనశైలిలో బంగారానికి Gold ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం ఆభరణం కాదు.. ఆర్థిక భద్రతకు భరోసా.. పెట్టుబడికి మార్గం అని భావిస్తుంటారు.
బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంగా మారిపోయింది. ఇటీవలి కాలంలో చాలా మంది కూడా బంగారాన్ని స్థిరమైన పెట్టుబడి (investment) గా భావిస్తున్నారు. అయితే బంగారం ధరలపై అంతర్జాతీయ మార్కెట్ , డాలర్ విలువ , ద్రవ్యోల్బణం , ఆర్థిక మార్పులు వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి.
ముఖ్యంగా డాలర్ బలపడితే బంగారం ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇక వెండి ధర కూడా బంగారానికి పోటీగా మారిపోయింది. ఫలితంగా విలువైన లోహాలపై ఆసక్తి పెరుగుతోంది.
Gold Price on August 30 : పసిడి పైపైకి..
ఈ రోజు (ఆగస్టు 30, శనివారం) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారట్ల మేలిమి బంగారం అంటే 99.9 స్వచ్ఛమైన బంగారం రూ. 10లు పెరిగి రూ. 1,03,320కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ. 10లు పెరిగి రూ. 94,710లకు చేరుకుంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..
- చెన్నైలో 24 క్యారట్ల మేలిమి బంగారం ధర రూ.1,03,320 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 94,710గా ట్రేడ్ అయింది.
- ముంబైలో 24 క్యారట్ల మేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320, రూ. 94,710గా నమోదైంది.
- ఢిల్లీలో Delhi 24 క్యారట్ల మేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,347, రూ. 94,486గా ట్రేడ్ అయింది.
- ఇక కోల్‌కతాలో 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320 రూ. 94,710గా నమోదైంది.
- బెంగళూరులో 24 క్యారట్లమేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320 రూ. 94,710గా నమోదైంది.
- కేరళలో 24 క్యారట్ల మేలిమి బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,03,320 రూ. 94,710గా ట్రేడ్ అయింది.
బంగారం తర్వాత వెండి లోహానికి అత్యంత ప్రాముఖ్యం ఉండగా.. ఈ లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగానే ఉంటున్నాయి. గత కొంత కాలంగా వెండిని కూడా మంచి పెట్టుబడిగా భావిస్తున్న నేపథ్యంలో పసిడి బాటలో వెండి ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి. అయితే ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర Silver Price స్వల్పంగా తగ్గి రూ. 1,29,800గా ట్రేడ్ అయింది.