అక్షరటుడే, హైదరాబాద్: Cancelled Trains : భిక్కనూరు – తలమడ్ల ప్రాంతంలో పొంగిపొర్లిన వరద వల్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కొన్ని రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన జారీ చేసింది.
Cancelled Trains : రద్దు చేసిన రైళ్లు:
- రైలు నం. 12793 : – (తిరుపతి – నిజామాబాద్) రాయలసీమ ఎక్స్ప్రెస్ Rayalaseema Express, 30.08.2025 న రద్దు
- రైలు నం. 12737 : – (కాకినాడ పోర్టు – లింగంపల్లి) గౌతమి ఎక్స్ప్రెస్ Gautami Express, 30.08.2025 న రద్దు
- రైలు నం. 17405 : – (తిరుపతి – ఆదిలాబాద్) కృష్ణ ఎక్స్ప్రెస్ Krishna Express, 31.08.2025 న రద్దు
Cancelled Trains : దారి మళ్లించిన రైలు:
- రైలు నం. 17605 – (కాచిగూడ – భాగత్ కి కోటి) 29.08.2025 న బయలుదేరాల్సిన ఈ రైలును బాలార్షా – మజిరి – వర్ధా – అకోలా మార్గం మీదుగా మళ్లించారు.
- నిజామాబాద్ – అకోలా మధ్య స్టేషన్లు ఈ మార్గంలో దాటవేయబడ్డాయి.
- ఈ రైలు 30.08.2025 ఉదయం 06:30 గంటలకు బయలుదేరుతుంది. మొదట నిర్ణయించబడిన సమయం 29.08.2025 రాత్రి 11:50 గం.కి బదులుగా తాజా సమయంగా ప్రకటించారు.
ఈ మేరకు ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలు సవరించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ సూచించారు.