అక్షరటుడే, వెబ్డెస్క్: vinayaka chavithi | దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి (Ganesh Navratri) ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతివీధిలో మండపం ఏర్పాటు చేసి గణనాథుడిని ప్రతిష్ఠించారు. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు సైతం వినాయక చవితిని (Vinayaka Chavithi) భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అమెరికాలోని (America) ఫ్లోరిడాలో గల స్టాన్ఫోర్డ్ నగరంలో తెలుగు వారు వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం కూడా నిర్వహించారు. దాదాపు 40 తెలుగు కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.
