ePaper
More
    HomeతెలంగాణUrea | యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే సస్పెండ్​ చేస్తా.. మంత్రి పొంగులేటి వార్నింగ్​

    Urea | యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే సస్పెండ్​ చేస్తా.. మంత్రి పొంగులేటి వార్నింగ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Urea | రాష్ట్రంలో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

    యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే.. ఆ అధికారులను స్పాట్​లో సస్పెండ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఇకపై పీఏసీఎస్​ కేంద్రాల ద్వారా మాత్రమే రైతులకు యూరియా సరఫరా చేయాలన్నారు.

    యూరియా అక్రమ రవాణాను అధికారులు అరికట్టాలని ఆదేశించారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు.

    Urea | అందుకే యూరియా కొరత

    రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన స్థాయిలో యూరియా సరఫరా చేయలేదని మంత్రి ఆరోపించారు. అందువల్లే కొరత ఏర్పడిందన్నారు.

    సాంకేతిక సమస్యలతో రామగుండంలో ఉత్పత్తి నిలిచిపోయిందని చెప్పారు. యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖాధికారులు ఇతర శాఖల సిబ్బందిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

    Urea | కాంగ్రెస్​ను దీవించండి

    రాష్ట్రంలో రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)​ను దీవించాలని మంత్రి పొంగులేటి కోరారు. కూసుమంచిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరదలను కూడా బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

    కాళేశ్వరం ప్రారంభించింది, కూలింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే అని పొంగులేటి అన్నారు. దానిపై అసెంబ్లీలో చర్చిస్తే తప్పేంటని ప్రశ్నించారు.

    పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చేందుకు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు అర్హత లేదన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో భట్టి విక్రమార్కకు అసెంబ్లీలో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు.

    Latest articles

    Cancelled Trains | వీడని భారీ వర్షాల గండం.. పలు రైళ్ల రద్దు.. అవేమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Cancelled Trains : భిక్కనూరు – తలమడ్ల ప్రాంతంలో పొంగిపొర్లిన వరద వల్ల రైల్వే ట్రాక్​...

    Kamareddy Flood damage | తక్షణ పనులకు నిధులు రూ. 22 కోట్లు.. శాశ్వత పనులకు రూ. 130 కోట్లు.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Flood damage : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district)...

    Vikram Singh Mann | తెలంగాణ విజిలెన్స్‌ కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్‌ (Telangana Vigilance) కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌...

    ACB | ఏసీబీ దూకుడు.. హాస్టల్​, గురుకుల పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటున్న అధికారులు వల పన్ని...

    More like this