అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | భారీ వర్షాలతో బాల్కొండ నియోజకవర్గంలోని మోతె, భీమ్‌గల్, బడా భీమ్‌గల్ గ్రామాల్లో రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పర్యటించారు.
భీమ్‌గల్‌లోని (Bheemgal) కప్పల వాగు (Kappala Vaagu), పెద్దవాగును పరిశీలించారు. పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరించి, ప్రభుత్వానికి నివేదించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
వేల్పూర్ (Velpur), మోతె మధ్య గల కల్వర్టు పూర్తిగా శిథిలావస్థకు చేరిందన్నారు. అయితే నూతన కల్వర్టు కోసం నిధులు మంజూరు కాగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపేసిందని ఆరోపించారు.
వెంటనే కల్వర్టు నిర్మాణం కోసం నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కమ్మర్‌పల్లి మండలం ఉప్పల రోడ్డు కోతకు గురి కాగా, తాత్కాలిక మరమ్మతు చేయాలని సూచించారు.
నేలవాలిన వరిపైరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి