అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bribe | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పనికోసం కార్యాలయానికి వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల (state-level officials) వరకు లంచాలకు మరిగారు. కొందరు అధికారులు డబ్బులు తీసుకోనిదే ఏ పని చేయడం లేదు. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా (Karimnagar district) వీణవంక మండలం చల్లూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB officials) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కొత్తగా నిర్మించిన ఓ ఇంటికి నంబర్ కేటాయించేందుకు సెక్రెటరీ రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. బాధితుడి శుక్రవారం నుంచి శుక్రవారం లంచం డబ్బులు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. కార్యదర్శిని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టులో (Karimnagar ACB court) హాజరు పర్చారు.
Bribe | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.