ePaper
More
    Homeఅంతర్జాతీయంThailand PM | ఫోన్ కాల్ లీక్‌తో ఊడిన దేశ ప్ర‌ధాని ప‌ద‌వి.. ఈ ఘ‌ట‌న...

    Thailand PM | ఫోన్ కాల్ లీక్‌తో ఊడిన దేశ ప్ర‌ధాని ప‌ద‌వి.. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand PM | ఒక్క ఫోన్ కాల్ లీక్ (Phone Call Leak) దేశ ప్రధాని పదవిని దూరం చేసింది. ఈ ఘ‌ట‌న థాయిలాండ్‌లో జ‌రిగింది. థాయిలాండ్‌ అతి పిన్న వయస్కురాలైన ప్రధాని పటోంగ్టార్న్ షినవత్రా (prime minister Patongtarn Shinawatra) అనూహ్యంగా తన పదవిని కోల్పోయారు.

    నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై థాయ్ రాజ్యాంగ న్యాయస్థానం అనర్హత వేటు వేసింది. ఏడాది క్రితమే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షినవత్రా, తాజాగా వెలువడిన తీర్పుతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మే నెలలో థాయిలాండ్, కంబోడియా (Thailand – Cambodia) మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో షినవత్రా కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్‌తో ఫోన్‌లో మాట్లాడారు.

    Thailand PM | కాల్ లీక్ ఎంత ప‌ని చేసింది..

    ఆ కాల్‌లో ఆమె థాయ్ సైన్యాధికారిపై విమర్శలు చేసిన ఆడియో బయటకు లీక్ (audio Leak) కావడం, దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన న్యాయస్థానం.. “సరిహద్దు వివాద సమయంలో దేశ సైన్యంపై విమర్శలు చేయడం జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించడం” అని అభిప్రాయపడింది. ప్రభుత్వ అధినేతగా ఉన్న ఆమె నైతిక బాధ్యతలకు భంగం కలిగించారని, వెంటనే పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. షినవత్రా తొలగింపుతో థాయ్ పార్లమెంట్‌కి కొత్త ప్రధానిని ఎన్నుకునే బాధ్యత వచ్చేసింది.

    ప్రస్తుతం ఉప ప్రధాని ఫుమ్తామ్ వెచైచాయ్ తాత్కాలిక ప్రధానిగా (Prime Minister) బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అయితే, షినవత్రాకు చెందిన ఫ్యూథాయ్ పార్టీకి స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండడంతో, కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియ కూడా కష్టతరమయ్యే అవకాశముంది. ఈ రేసులో 77 ఏళ్ల చైకాసెం నితిసిరి, ఫ్యూథాయ్ పార్టీ తరఫున ముందంజలో ఉన్నారు. మరోవైపు, మాజీ ప్రధాని, సైనిక నేత ప్రయుత్ చాన్-ఓచా పేరు కూడా చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం ఇదే రాజ్యాంగ న్యాయస్థానం నాటి ప్రధానిని తొలగించడంతో షినవత్రా అప్రతీక్షంగా ప్రధానిగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఆమె కూడా అదే విధంగా పదవిని కోల్పోవడం, థాయిలాండ్ రాజకీయాల్లో మరో కీలక మలుపుగా చూస్తున్నారు.

    Latest articles

    Cancelled Trains | వీడని భారీ వర్షాల గండం.. పలు రైళ్ల రద్దు.. అవేమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Cancelled Trains : భిక్కనూరు – తలమడ్ల ప్రాంతంలో పొంగిపొర్లిన వరద వల్ల రైల్వే ట్రాక్​...

    Kamareddy Flood damage | తక్షణ పనులకు నిధులు రూ. 22 కోట్లు.. శాశ్వత పనులకు రూ. 130 కోట్లు.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Flood damage : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district)...

    Vikram Singh Mann | తెలంగాణ విజిలెన్స్‌ కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్‌ (Telangana Vigilance) కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌...

    ACB | ఏసీబీ దూకుడు.. హాస్టల్​, గురుకుల పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటున్న అధికారులు వల పన్ని...

    More like this