అక్షరటుడే, ఇందూరు: Palaj Ganapati temple | తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ కర్ర గణపతి ఆలయంలో (Palaj Karra Ganapati temple) భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మహారాష్ట్రలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద నీరు (Flood Water) ఏకంగా ఆలయంలోకి చేరింది. పాలజ్లో కర్ర గణపతికి ఎంతో విశిష్టత ఉంది. నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అయితే ప్రస్తతం వరద నీటిని బయటకు తోడేసే పనిలో అక్కడి యంత్రాంగం నిమగ్నమయ్యారు.
Palaj Ganapati temple | ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో ప్రతిష్ఠాపన
1949లో ప్లేగు వ్యాధి (plague disease) ప్రబలింది. దీంతో ఈ వ్యాధి తగ్గిపోవాలని వేడుకుంటూ గ్రామస్థులు పాలాజ్లో చెక్క వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఆ విగ్రహాన్ని అప్పటినుంచి ఇప్పటివరకు నిమజ్జనం చేయలేదు. ఈ విగ్రహానికి పూజలు చేయడం ద్వారా ప్రాణాంతక వ్యాధులు నయమవుతున్నాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం.
Palaj Ganapati temple | ఇదే స్ఫూర్తితో..
పాలజ్ గణపతి విగ్రహం (Palaj Ganapati idol) గ్రామస్థుల ఐకమత్యానికి చిహ్నంగా మారింది. ఈ విగ్రహం స్ఫూర్తితో నిర్మల్ జిల్లాలోని (Nirmal district) అనేక గ్రామాలు చెక్క గణపయ్యలను ప్రతిష్ఠించి, వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తున్నాయి.