ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Peddareddy | మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

    Peddareddy | మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddareddy | వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి ధర్మాసనం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

    ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) తాడిపత్రి నుంచి పోటీ చేసిన పెద్దారెడ్డి ఓడిపోయారు. దీంతో టీడీపీ నాయకులు ఆయన ఇంటిపై దాడి చేసి, పార్టీ జెండా ఎగుర వేశారు. అప్పటి నుంచి ఆయనను తాడిపత్రి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.

    Peddareddy | శాంతిభద్రతల పేరుతో

    మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి (former MLA Pedda Reddy) తాడిపత్రిలో అడుగు పెడితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆయన వెళ్లిన ప్రతిసారి అరెస్ట్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఆయన హైకోర్టును (Hicourt) ఆశ్రయించగా.. తాడిపత్రి వెళ్లడానికి అనుమతి ఇచ్చింది. అయతే పోలీసులు మాత్రం ఆయన వెళ్లనీయలేదు. దీంతో మళ్లీ పెద్దారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేయగా.. ద్విసభ్య ధర్మాసనం విచారించింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వడం లేదని ఎస్పీ కోర్టుకు తెలిపారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం అంతుకు ముందు సింగిల్​ బెంచ్​ ఉత్తర్వులను రద్దు చేసింది. తాడిపత్రికి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.

    Peddareddy | మిమ్మల్ని ఎవరు ఆపుతారు

    తాడిపత్రి నియోజకవర్గంలో (Tadipatri constituency) వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో ఈ చర్యలకు పాల్పడుతోందని పెద్దారెడ్డి పిటిషన్​లో పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం విచారించిన న్యాయస్థానం ఆయన తాడిపత్రికి వెళ్లొచ్చని స్పష్టం చేసింది. గతంలో ఏపీ హైకోర్టు డివిజన్​ బెంచ్​ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. అంతేగాకుండా “మీ నియోజకవర్గంలోకి వెళ్లకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారని” కోర్టు వ్యాఖ్యానించింది.

    Peddareddy | భద్రత కల్పించాలి

    మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి పోలీసులు భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవసరం అయితే ఆయన ప్రైవేట్​ సెక్యూరిటీ పెట్టుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పోలీసు బందోబస్తుకు అవసర​మైన ఖర్చును ఆయనే పెట్టుకోవాలని సూచించింది. దీనికి పెద్దారెడ్డి తరఫు న్యాయవాదులు అంగీకరించారు. దీంతో పెద్దారెడ్డి తన నియోజకవర్గంలో త్వరలో పర్యటించనున్నారు.

    Latest articles

    Cancelled Trains | వీడని భారీ వర్షాల గండం.. పలు రైళ్ల రద్దు.. అవేమిటంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Cancelled Trains : భిక్కనూరు – తలమడ్ల ప్రాంతంలో పొంగిపొర్లిన వరద వల్ల రైల్వే ట్రాక్​...

    Kamareddy Flood damage | తక్షణ పనులకు నిధులు రూ. 22 కోట్లు.. శాశ్వత పనులకు రూ. 130 కోట్లు.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Flood damage : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district)...

    Vikram Singh Mann | తెలంగాణ విజిలెన్స్‌ కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్‌ (Telangana Vigilance) కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌...

    ACB | ఏసీబీ దూకుడు.. హాస్టల్​, గురుకుల పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటున్న అధికారులు వల పన్ని...

    More like this