ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | ఎల్లారెడ్డిలో జలవిలయం.. కొట్టుకుపోయిన చెరువులు.. కూలిన ఇళ్లు..

    Yellareddy | ఎల్లారెడ్డిలో జలవిలయం.. కొట్టుకుపోయిన చెరువులు.. కూలిన ఇళ్లు..

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని (Yllareddy constituency) భారీ వర్షం కుదిపేసింది. అల్పపీడన ప్రభావంతో మూడు రోజులపాటు ఏకధాటిగా కురిసిన వర్షాలు వాగులు, వంకలు, రోడ్లు, పొలాలను ఏకం చేశాయి.

    గతంలో లేనివిధంగా వరదలు పోటెత్తాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలకు ఆటంకం కలిగింది. జనజీవనం స్తంభించింది.

    Yellareddy | పోచారం ప్రాజెక్టుకు తగ్గని వరద..

    పోచారం ప్రాజెక్టుకు (Pocharma Project) వరద తగ్గడం లేదు. గాంధారి, గుండారం వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రాజెక్టులోకి 49 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరింది. ప్రాజెక్టు వద్ద ఏర్పడిన గుంతను ట్రాక్టర్ల సహాయంతో మట్టితో పూడ్చివేశారు.

    ప్రాజెక్టుకు ప్రమాదం తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 1.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుని నిలిచిన ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ప్రశంసలు కురిపించారు.

    Yellareddy | కళ్యాణి ప్రాజెక్టుకూ అంతే..

    కళ్యాణి ప్రాజెక్టుకు (kalyani Project) సైతం వరద ఉధృతి కొనసాగుతోంది. తిమ్మాపూర్, లక్ష్మాపూర్, అడవి లింగాల్‌ అటవీ ప్రాంతాల నుంచి 6 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది.

    ప్రాజెక్టు వరద గేట్ల పైనుంచి ఉప్పొంగి ప్రవహించడంతో మట్టి కట్ట కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గితే ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

    Yellareddy | దెబ్బతిన్న రోడ్లు..

    ఎల్లారెడ్డి డివిజన్‌ (Yellareddy Division) పరిధిలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 129 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

    వాటి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 13 చెరువులకు గండ్లు పడి నీరు వృథాగా పోయింది. తిరుమల కింద ఉన్న పంట పొలాలు దెబ్బతిన్నాయి. ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్ (Hyderabad), కామారెడ్డి (Kamareddy), బాన్సువాడ మార్గాల్లో 17 కల్వర్టుల వద్ద రోడ్లు ధ్వంసమయ్యాయి.

    దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. వందల ఎకరాల్లో నీట మునిగిన పంటల వివరాలను వ్యవసాయ అధికారులు పరిశీలిస్తున్నారు. రెండు కోళ్ల ఫాంలు ధ్వంసమయ్యాయి. అందులోని 10వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి.

    పోచారం ప్రాజెక్టు వద్ద పేర్చిన ఇసుక బస్తాలు

    కూలిన ఇళ్ల వివరాలు సేకరిస్తున్న అధికారులు

    కల్యాణి ప్రాజెక్ట్​ వద్ద వరద ఉధృతి

    Latest articles

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    More like this