అక్షరటుడే, బోధన్ : Nizamabad Collector | ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి భారీగా వరద వస్తోంది. దీంతో మండలంలోని హంగార్గ గ్రామంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్(SRSP Backwater) చేరుకుంది. వరద ముంచెత్తడంతో గ్రామంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గ్రామంలోకి వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు(SDRF Teams) ఇప్పటికే హంగార్గా గ్రామానికి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు.
అదేవిధంగా సాలురా మండలం(Salura Mandal) హున్సా, మందర్న గ్రామాల్లో(Mandarna Village) వరద చేరుకోవడంతో ఆ గ్రామాల ప్రజలను సాలూరాలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ గ్రామాలను కూడా కలెక్టర్ సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆయా గ్రామాలలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు.
వరద ఉధృతి తగ్గుతుందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ అన్నారు. కలెక్టర్‌తో పాటు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహశీల్దార్ విఠల్, శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు.