అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Track | బెల్లంపల్లి నుంచి రేచినీ రోడ్డు (తాండూరు) మధ్య 10 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. బెల్లంపల్లి నుంచి మందమర్రి, మాణిక్ఘడ్ నుంచి బల్లార్షా (Ballarsha) మధ్య 20 కిలోమీటర్లు పూర్తయితే కాజీపేట నుంచి బల్లార్షా సెక్షన్ మొత్తం మూడో మార్గం అందుబాటులోకి వస్తుంది.
ఉత్తర, దక్షిణ భారత (North and South India) దేశాలను కలిపే కీలక మార్గం కాజీపేట –బల్లార్షా. ఈ మార్గంలో నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇక్కడ ఇప్పటికే రెండు రైల్వే ట్రాక్లు ఉన్నాయి. అయితే రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూడో లైన్ నిర్మాణం చేపట్టారు.
Railway Track | 235 కిలోమీటర్ల మేర..
కాజీపేట నుంచి బల్లార్షా (Kazipet to Ballarsha) సెక్షన్ మొత్తం దూరం 235 కిలోమీటర్లు. ఈ మార్గంలో మూడో రైల్వే లైన్ పనులను 2016లో ప్రారంభించారు. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ సెక్షన్లో మిగిలిన 20 కిలోమీటర్లు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారుకు ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఈ సెక్షన్ మొత్తం మూడో మార్గం అందుబాటులోకి వస్తుంది.
Railway Track | త్వరలో నాలుగో లైన్
కాజీపేట–బల్లార్షా మార్గంలో మూడో లైన్ పూర్తయిన తర్వాత నాలుగో లైన్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. ఇటీవలే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) కాజీపేట జంక్షన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ పరిశ్రమ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆయన నాలుగో లైన్ నిర్మాణం గురించి అధికారులతో చర్చించారు. ఈ మేరకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే అధికారులు నాలుగో లైన్ నిర్మాణం కోసం సర్వే కూడా చేస్తున్నారు. అనంతరం డీపీఆర్ తయారు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నారు.