ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBanswada | పొంగిపొర్లుతున్న చెరువుల్లో ప్రమాదకరంగా చేపలవేట..

    Banswada | పొంగిపొర్లుతున్న చెరువుల్లో ప్రమాదకరంగా చేపలవేట..

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నా స్థానికులు పట్టించుకోవడం లేదు.

    వరద ప్రవాహానికి దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, స్థానికులు ఆ సూచనలను పట్టించుకోకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేపల వేట కొనసాగిస్తున్నారు. బాన్సువాడ మండలం కోనాపూర్​లో చెరువు (Konapur Cheruvu) ప్రమాదకర స్థాయికి చేరి అలుగు పారుతోంది. నీటి ఉధృతి అధికంగా ఉన్నప్పటికీ స్థానికులు అలుగు వద్ద చేపలు పడుతున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

    ఇటీవల నస్రుల్లాబాద్​ (Nasruallabad) మండలం దుర్కి (Durki) శివారు కల్వర్టు వద్ద చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ కొంతమంది పట్టించుకోకుండా చేపలు పడుతున్నారు.

    More like this

    CM Revanth Reddy | విపత్తుల నిర్వహణలో కామారెడ్డి మోడల్​గా నిలవాలి: సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | వరదలకు సంబంధించి అంచనాలను ప్రణాళికాబద్దంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల కోసం తమ వద్దకు...

    CM Chandrababu | సుగాలి ప్రీతి కేసు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Chandrababu | సుగాలి ప్రీతి (Sugali preethi) మరణకేసు కీలక మలుపు తిరిగింది. ఈ...