ePaper
More
    Homeజిల్లాలుమెదక్​Medak | వర్షానికి కొట్టుకుపోయిన రైల్వేట్రాక్​.. మెదక్​ను వీడని వరదలు

    Medak | వర్షానికి కొట్టుకుపోయిన రైల్వేట్రాక్​.. మెదక్​ను వీడని వరదలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medak | మెదక్​ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టిన వరదలు వీడటం లేదు. రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో (heavy rains) జిల్లా అతలాకుతలం అయింది.

    మెదక్​ జిల్లావ్యాప్తంగా (Medak district) మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. గురువారం కూడా మోస్తరు వాన పడగా.. శుక్రవారం ముసురు పెట్టింది. బుధవారం భారీ వరదలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. కాగా శుక్రవారం ఉదయం రామాయంపేట మండలం శమ్నాపూర్‌ వద్ద వరదలకు రైల్వే ట్రాక్​ కొట్టుకుపోయింది. భారీ వరదతో రైల్వేట్రాక్ (railway track) నీట మునిగింది. దీంతో శేఖర్‌ అనే రైతు రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. స్పందించిన అధికారులు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు.

    Medak | నీట మునిగిన ఏడుపాయల ఆలయం

    మెదక్​ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం (Edupayala Temple) పూర్తిగా నీట మునిగింది. సింగూరు నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో ఏడుపాయలలో మంజీర ఉధృతంగా పారుతోంది. దీంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. రాజగోపురం వద్ద వనదుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. వరద ఉధృతి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    Medak | తీవ్ర నష్టం

    రాజ్​పేట–వాడి మార్గంలో పొలంలోకి కొట్టుకు వచ్చిన రాళ్లు

    వర్షాలతో హవేలి ఘన్​పూర్​ మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పోచారం ప్రాజెక్ట్​కు భారీగా వరద రావడంతో మండలంలోని రాజ్​పేట వంతెన (Rajipet bridge) వద్ద రోడ్డు కోసుకుపోయింది. రాజీపేటకు చెందిన ఇద్దరు వరద నీటిలో గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం లభించింది. బూర్గుపల్లి గ్రామంలో చెరువు అలుగు పారడంతో రోడ్డు తెగిపోయింది. మంత్రి వివేక్​, ఎంపీ రఘునందన్ ​రావు (MP Raghunandan Rao), ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​, మాజీ మంత్రి హరీశ్​రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి బూర్గుపల్లి, వాడి, రాజీపేటలో గురువారం పర్యటించారు. నష్టం వివరాలను తెలుసుకున్నారు. అయితే బూర్గుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డుకు స్థానికులు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు.

    రాజ్​పేట్​–వాడి మార్గంలో ధ్వంసమైన రోడ్డు

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...