అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Electricity Department | మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని శివారు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Electricity Department | కరెంట్ లేక..
భారీ వర్షం కారణంగా కాలనీల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు(Electrical wires) తెగి రోడ్డుపై పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నగరంలోని (Nizamabad City) పూలాంగ్ (Pulang) ప్రాంతంలో కరెంటు తీగలు తెగిపోయి రోడ్లపై పడ్డాయి. రాత్రి తీగలు రోడ్డుపై పడ్డప్పటికీ విద్యుత్ అధికారులు ఎవరూ స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి విద్యుత్ లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. అధికారులు స్పందించి విద్యుత్ పునరుద్ధరించాలని కోరారు.