అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అలాగే చాలా ప్రాంతంలో నాలాలు పొంగిపొర్లాయి. పూలాంగ్ వాగు సైతం ఉధృతంగా ప్రవహిస్తోంది.
Nizamabad City | గుంతలతో ఇబ్బందులు..
నగరంలోని ప్రధాన రోడ్లల్లో భారీగుంతలను వాహనదారులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా వర్షం కురిసినప్పుడు ఈ గుంతలు నీళ్లతో నిండిపోయి ఏర్పడకపోవడంతో పలువురు వాహనదారులు వీటిలో పడి గాయాలపాలైన సంఘటనలున్నాయి.
నగరంలోని ప్రగతి హాస్పిటల్ (Pragathi Hospital) నుంచి ప్రగతినగర్ మున్నూరుకాపు (Pragathi nagar Munnurkapu sangham) సంఘం వైపు వెళ్లే చౌరస్తాలో భారీ గుంత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
దీంతో స్పందించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ (Traffic Inspector Prasad) తన సిబ్బందితో గుంతను పూడ్చివేయించారు. జేసీబీ సాయంతో గుంతను కప్పివేయించారు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Nizamabad City | నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ హోంగార్డ్
నగరంలోని ఓ వ్యక్తి రోడ్డుపై సెల్‌ఫోన్ పోగొట్టుకోగా ట్రాఫిక్ హోంగార్డు (Traffic Home Guard) గుర్తించి తిరిగి అతడికి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని కోటగల్లీకి (Kotagally) చెందిన రాజేశ్వర్ ఎప్పటిలాగే తన ఫైనాన్స్ విధుల్లో భాగంగా బైక్‌పై వెళ్తుండగా ఖలీల్వాడిలో తన ఫోన్‌ను పోగొట్టుకున్నాడు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డు గంగామోహన్ ఫోన్‌ను గుర్తించి సెల్‌ఫోన్ యజమాని రాజేశ్వర్‌కు ఫోన్‌చేసి పిలిపించారు. అనంతరం అతడికి ఫోన్‌ను అందజేశారు. సుమారు రూ.18వేల ఫోన్‌ను తిరిగి యజమానికి ఇచ్చిన ట్రాఫిక్ హోంగార్డు గంగామోహన్‌ను ట్రాఫిక్ ఏసీపీ గంగామోహన్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు.
తనకు దొరికిన సెల్‌ఫోన్‌ను తిరగి అందజేస్తున్న ట్రాఫిక్ హోంగార్డు గంగామోహన్