ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Pawan Kalyan | ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త ఇంటికి వెళ‌తాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

    Pawan Kalyan | ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త ఇంటికి వెళ‌తాను.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జనసేన సాధించిన విజయాన్ని భారత రాజకీయ చరిత్రలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. “నో సీట్ టూ వన్ సీట్… వన్ టూ 100% స్ట్రైక్ రేట్” అంటూ కొత్త చరిత్రను లిఖించామన్నారు. విశాఖపట్నంలో మూడు రోజుల పాటు జరుగుతున్న జనసేన(Janasena) విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పార్టీని నడిపించడానికి డబ్బు కాదు, సైద్ధాంతిక బలం అవసరమన్నారు. “కులం, మతం, ప్రాంతం పేరుతో కొంతకాలం మాత్రమే రాజకీయం చేయవచ్చు. కానీ, పార్టీని నిలబెట్టాలంటే స్థిరమైన విలువలు అవసరం,” అన్నారు.

    Pawan Kalyan | కీల‌క వ్యాఖ్య‌లు..

    “15 ఏళ్లుగా పదవిలేకుండానే రాజకీయాల్లో ఉన్నాను. బీజేపీ(BJP)లో ఉంటే సంచి పట్టుకొని విరాళాలు తీసుకునేవాడిని. కానీ జనసేన సిద్ధాంతం అది కాదు, బలం నేను ఇవ్వాలి” అని చెప్పారు. సుగాలి ప్రీతి కేసు(Sugali Preethi Case) విషయమై స్పందించిన పవన్, తాను ఉపముఖ్యమంత్రి అయ్యాక సీఐడీ, డీజీపీ, హోంమంత్రులతో చర్చించి వేగంగా న్యాయం జరగాలంటూ ఆదేశించానని తెలిపారు. అనుమానితుల డీఎన్ఏలు సరిపోకపోవడం, సాక్ష్యాల తారుమారుదల నేపథ్యంలో కేసును పునర్విచారణ చేపట్టినట్లు తెలిపారు.“బాలికల భద్రత రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశం. న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు.

    విశాఖ ఉక్కు అంశంపై మాట్లాడుతూ, “విశాఖ స్టీల్ ఆంధ్రుల హక్కు. గత సీఎం ఢిల్లీ మెడలు వంచుతామని చెప్పి… అక్కడ మాత్రం మాట్లాడలేరు,” అంటూ ఎద్దేవా చేశారు.ప్రైవేటీకరణను నిలిపే విషయంలో తాను అమిత్ షా‌(Amit Shah)తో భేటీ అయ్యి వినతిపత్రం అందించానని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్రం నుంచి రూ.14 వేల కోట్ల సహాయం వచ్చిందని చెప్పారు.తాను అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కార్యకర్తలకు దగ్గరగా ఉండడమే లక్ష్యంగా పనిచేస్తానని పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు.“గాజువాక కార్యకర్త సురేష్ కుమార్ ఇచ్చిన సూచన చాలా మంచిది. వచ్చే పర్యటనలో ఆయన ఇంటికే వెళ్లి బస చేస్తాను. అదే విధంగా పిఠాపురం, తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తాను,” అని చెప్పారు. కార్యకర్తల సమస్యలు, ఆలోచనలు నేరుగా తెలుసుకుంటానని హామీ ఇచ్చారు.

    2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి అఖండ విజయం ఇచ్చారని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. “కూటమి స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కలయిక అవసరం,” అని అన్నారు.

    Latest articles

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    More like this

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...