ePaper
More
    Homeఅంతర్జాతీయంUS Vice President | అవ‌స‌ర‌మైతే అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రిస్తా.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ...

    US Vice President | అవ‌స‌ర‌మైతే అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రిస్తా.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Vice President | అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఏదైనా విషాదం సంభంవిస్తే అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఆరోగ్యంపై ఆందోళనలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వాన్స్ తాజా వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అయితే, ట్రంప్ ‘చాలా మంచి ఆరోగ్యం’తో ఉన్నారని, ఆయనకు ‘అద్భుతమైన శక్తి’ ఉందని యూఎస్ టుడేకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. 79 సంవ‌త్స‌రాల ట్రంప్.. అమెరికా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అత్య‌ధిక పెద్ద వ‌య‌స్కుడు.

    US Vice President | ఆరోగ్యంగానే ట్రంప్‌..

    అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నార‌ని 41 ఏళ్ల జేడీ వాన్స్ తెలిపారు. అమెరికా చ‌రిత్ర‌లో మూడో అత్యంత పిన్న వ‌య‌స్కుడైన ఉపాధ్య‌క్షుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. ట్రంప్ తో ప‌ని చేసే వారిలో చాలా మంది ఆయ‌న కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న‌వాళ్లేన‌ని, కానీ వారంద‌రికీ ఆల‌స్యంగా నిద్ర‌పోవ‌డం, తొంద‌ర‌గా మేల్కొవ‌డంలో అధ్య‌క్షుడే ముందుంటార‌న్నారు. కొన్నిసార్లు భ‌యంక‌ర‌మైన విషాదాలు చోటు చేసుకుంటాయ‌ని, వాట‌న్నింటినీ దాటుకుని ట్రంప్ పూర్తి ప‌ద‌వీ కాలంలో కొన‌సాగుతారని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. ఆయ‌న అమెరికన్ల‌కు మంచి చేస్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఒక‌వేళ ఏదైనా విషాదం జ‌రిగితే తాను అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీకరించేందుకు సిద్ధ‌మ‌ని తెలిపారు. “యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు(United States President) ఆరోగ్యంగా మంచి స్థితిలో ఉన్నారు. ఆయ‌న తన పూర్తి పదవీకాలంలో ఉంటారు. అమెరికన్ ప్రజలకు గొప్ప పనులు చేస్తారని నేను చాలా నమ్మకంగా ఉన్నాను” అని వాన్స్ అన్నారు. “దేవుడు నిషేధించినట్లయితే, ఒక భయంకరమైన విషాదం జరిగితే, గత 200 రోజుల్లో నేను పొందిన దానికంటే మెరుగైన ఉద్యోగ శిక్షణ గురించి నేను ఆలోచించలేనని” అధ్య‌క్ష బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ గురించి పేర్కొన్నారు.

    US Vice President | ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళనలు

    ట్రంప్ తన పదవీకాలాన్ని పూర్తి చేస్తే, ఆయన అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా మారతారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్.. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ అనారోగ్యంపై పదేపదే దాడి చేసే వారు. తరచుగా ఆయనను ‘స్లీపీ జో’ అని ఎగతాళి చేశారు. అయితే, ఇప్పుడు ట్రంప్ కూడా అదే అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో విమర్శలకు గురవుతున్నారు. త‌న వార‌సుడిగా జేడీ వాన్స్(US Vice President J.D. Vance) అవుతార‌ని ఇటీవ‌ల ట్రంప్ పేర్కొన్నారు. ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా 2028 అధ్యక్ష ఎన్నికలకు తన వారసుడు ఆయ‌నే కావచ్చని తెలిపారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ (మాగా) ఉద్యమానికి తన ‘వారసుడు’ ఎవరు అని ప్ర‌శ్న‌కు జేడీ వాన్స్ పేరునే చెప్పారు.

    Latest articles

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...

    Malaysia Independence Day | తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మలేసియా స్వాతంత్య్ర దినోత్సవ సంబరం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Malaysia Independence Day | మలేసియా 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం (సెప్టెంబరు 1)...

    More like this

    RAIN ALERT | వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు

    అక్షరటుడే, హైదరాబాద్: RAIN ALERT | తెలంగాణపై మరో ముప్పు పడగ విప్పబోతోంది. ఇటీవలే కామారెడ్డి, మెదక్​, సిద్దిపేట,...

    Apex Committee | వరద బాధిత రైతులను ఆదుకోవాలి : అపెక్స్ కమిటీ మెంబర్ అంజయ్య

    అక్షరటుడే, లింగంపేట : Apex Committee : భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ...

    Paranjyoti Ammavaru | కన్నీరు పెట్టిన పరంజ్యోతి అమ్మవారు..! అందుకే కామారెడ్డిలో వర్షం ఆగిందట!

    అక్షరటుడే, కామారెడ్డి : Paranjyoti Ammavaru : అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లా (Kamareddy district) లో బీభత్సం...