ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Manjeera river | భారీ వర్షాలు.. పునరావాస కేంద్రానికి 30 కుటుంబాల తరలింపు

    Manjeera river | భారీ వర్షాలు.. పునరావాస కేంద్రానికి 30 కుటుంబాల తరలింపు

    Published on

    అక్షరటుడే, బోధన్: Manjeera river | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఇక మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో నిజాంసాగర్​కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి పెద్ద ఎత్తున వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

    Manjeera river | రెండు గ్రామాల నుంచి 30 కుటుంబాల తరలింపు

    మంజీర నది ఉగ్రరూపం దాల్చడం సాలూర మండలంలోని రెండు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. హున్సాతో పాటు మందర్నా గ్రామాల్లోకి నీరు వచ్చింది. దీంతో ఈ రెండు ఊర్లలోని 30 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సాలూర తహశీల్దార్​ శశిభూషణ్​ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు కురస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Manjeera river | జలదిగ్బంధంలో హంగర్గ

    బోధన్ మండలం హంగర్గ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు భారీ వరద పోటెత్తుతోంది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఒకవైపు, మరోవైపు నిజాంసాగర్ గేట్లు తెరవడతో మంజీర ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హంగర్గ గ్రామం నీట మునిగింది. బోధన్ మండల తహశీల్దార్​ విఠల్​ శుక్రవారం ఉదయం గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్థులను పునరవాసానికి తరలిస్తున్నారు. అవసరమైన సహాయక చర్యలను చేపట్టారు.

    Latest articles

    Vikram Singh Mann | తెలంగాణ విజిలెన్స్‌ కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌

    అక్షరటుడే, హైదరాబాద్: Vikram Singh Mann : తెలంగాణ విజిలెన్స్‌ (Telangana Vigilance) కొత్త డీజీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌...

    ACB | ఏసీబీ దూకుడు.. హాస్టల్​, గురుకుల పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటున్న అధికారులు వల పన్ని...

    Asaduddin Owaisi | రాజకీయాల్లో హద్దులు దాటొద్దు.. మోదీ మాతృమూర్తిని కించపరచడాన్ని ఖండించిన ఒవైసీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Asaduddin Owaisi | రాజకీయాల్లో పరస్పర భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, భాష విషయంలో హద్దులు...

    Urea | యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే సస్పెండ్​ చేస్తా.. మంత్రి పొంగులేటి వార్నింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :  Urea | రాష్ట్రంలో యూరియా కొరత (Urea Shortage)తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ...

    More like this