అక్షరటుడే, వెబ్‌డెస్క్:Lemon Juice | వేసవిలో సాధారణంగా ఎక్కువగా తాగేది నిమ్మరసం (షర్బాత్). దాహం తీర్చడంతో పాటు చల్లదనం అందించే షర్బత్(sharbat) తాగేందుకు ప్రతి ఒక్కరూ మక్కువ చూపుతారు. నిమ్మరసం(Lemon Juice) శరీరాన్ని చల్లబరడచమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్-సీ(Vitamin-C) పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నిమ్మరసం తయారు చేసేటప్పుడు కొందరు తెలియక తప్పులు చేస్తుంటారు. అలా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనకరంగా ఉండదు. షర్బత్ తయారు చేసే సమయంలో ఈ ఐదు తప్పులను నివారించండి. మంచి రుచికరమైన నిమ్మరసం తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
Lemon Juice | అతి పులుపు అనర్థదాయం..
ఎక్కువగా నిమ్మకాయలు వినియోగించడం వల్ల షర్బత్ పుల్లగా, రుచికరంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కాని వాస్తవానికి ఇది షర్బత్(sharbat) రుచిని పాడు చేస్తుంది. అతి పులుపు కడుపులో సమస్యలు తెచ్చి పెడుతుంది. ఒక గ్లాస్ షర్బత్‌కు సగం లేదా ఒక చిన్న నిమ్మకాయ రసం సరిపోతుంది.
Lemon Juice | వేడి నీరు వద్దు..
షర్బత్(sharbat) తయారు చేయడానికి వేడి లేదా గోరువెచ్చని నీటిని వినియోగించవద్దు. నిమ్మరసం ఎల్లప్పుడూ చల్లని లేదా సాధారణ ఉష్ణోగ్రతతో ఉండే నీటితోనే తయారు చేయాలి. వేడి నీటికి నిమ్మరసం జోడించడం వల్ల దాని పోషక విలువలు తగ్గిపోతాయి. అలాగే, అంతగా రుచిగా కూడా ఉండదు.
Lemon Juice | ఎక్కువ చక్కెర వద్దు..
చాలా తక్కువ లేదా ఎక్కువ చక్కెర(Sugar)ను జోడించడం నిమ్మరసం వల్ల రుచి పాడవుతుంది. మీరు డయాబెటిక్ లేదా తక్కువ చక్కెర తీసుకోవాలనుకుంటే, తేనె(Honey) లేదా బెల్లం(Jaggery) కూడా ఉపయోగించవచ్చు. ఏదైనా మోతాదు మించకుండా వేసుకోవాలి,
Lemon Juice | నల్ల ఉప్పు ప్రయోజనకరం..
నిమ్మరసంలో కొందరు ఉప్పు కలుపుకుంటారు. అయితే, సాధారణ ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పు(Black salt) జోడించడం మరింత ప్రయోజనకరంగా ఉండడమే కాకుండా రుచిగా బాగుంటుంది. నల్ల ఉప్పు జీర్ణక్రియ(Digestion)కు సహాయపడుతుంది.
Lemon Juice | తాజా నిమ్మకాయలు..
కొందరు నిమ్మకాలను తీసుకొచ్చి కట్ చేసి ఫ్రీజ్‌లో ఉంచుతారు. అవసరాన్ని బట్టి వాడుతారు. అయితే, ఎప్పటికప్పుడు తాజాగా ఉండే నిమ్మకాయలను వినియోగించడం మంచిది. ఎల్లప్పుడూ తాజా నిమ్మకాయను వెంటనే కత్తిరించి షర్బత్ చేసుకోండి.
నిమ్మరసం(Lemon Juice) చాలా సులభమైన, ప్రయోజనకరమైన పానీయం, కానీ దానిని సిద్ధం చేయడంలో చేసిన చిన్న తప్పులు దాని రుచి, ఆరోగ్య ప్రయోజనాలను రెండింటినీ ప్రభావితం చేస్తాయి.