ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరతాం: మంత్రి సీతక్క

    Minister Seethakka | కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరతాం: మంత్రి సీతక్క

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | భారీ వర్షాల ధాటికి కామారెడ్డి జిల్లాకు అధికనష్టం వాటిల్లినందున డ్యామేజీ కంట్రోల్ కోసం ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని సీఎంను కోరతామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు.

    పట్టణంలో వరద ప్రాంతాల పరిశీలన అనంతరం గురువారం ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో (District Police Office) అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి(Kamareddy), ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గాల్లో పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని, గ్రామాలు, తండాలు ముంపుlకు గురయ్యాయన్నారు.

    అధికారులు, నాయకుల సహకారంతో ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోగలిగామని తెలిపారు. జిల్లాలో విపత్తులు జరిగినప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా వరదలు వచ్చే చెరువులు, కుంటలను గుర్తించి శివారు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించామని చెప్పారు.

    రెండు నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదారులను గుర్తించాలని చెప్పినట్లు తెలిపారు. జిల్లాలో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న 1,044 మందిని ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు, పోలీసులు సురక్షితంగా రక్షించారని తెలిపారు.

    నియోజకవర్గాల్లో 22 పీఆర్ రోడ్లు, 35 ఆర్​అండ్​బీ రోడ్లు దెబ్బతిన్నాయని, ఇంకా ఎక్కడెక్కడా డ్యామేజ్ అయ్యాయని క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. పురాతన కట్టడాల ప్రభావంతో పోచారం ప్రాజెక్టు తెగినా గట్టిగా నిలబడిందన్నారు.

    జాతీయ రహదారిని ఒకటి రెండు రోజుల్లో పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హెలికాప్టర్ ఇక్కడిదాక వచ్చిందని, ల్యాండ్​ సిగ్నల్ సరిగా గుర్తించకపోవడంతో మెదక్ (Medak) వెళ్లిపోయారని తెలిపారు. ఇక్కడి వరద నష్టం నివేదికను సీఎంకు అందజేస్తామని, కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరతామన్నారు.

    కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విపత్తుపై బాధ్యత తీసుకోవాలని, అత్యధిక నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali), ఎంపీ సురేష్ షెట్కార్ (MP Suresh Shetkar), ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Mla Madan mohan), కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ రాజేష్ చంద్ర, ఫైర్ అదనపు డీజీ నాగిరెడ్డి, అడిషనల్ డీజీ ఇక్బాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

    Latest articles

    August 29 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 29 Panchangam : తేదీ (DATE) – 29 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...

    Rescue team rescued | జల దిగ్బంధంలో కందకుర్తి ఆశ్రమం.. చిక్కుకుపోయిన 8 మంది భక్తులు.. రక్షించిన రెస్యూ బృందం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు...

    More like this

    August 29 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 29 Panchangam : తేదీ (DATE) – 29 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...