అక్షరటుడే, ఆర్మూర్: Armoor Flood | నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు 28) ఉదయం నుంచే ఎడతెరపీయకుండా వర్షం కురుస్తోంది.
ఆర్మూర్ పట్టణంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
ఫలితంగా ఆర్మూర్ Armoor లోని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఓ వైపు వాన, మరోవైపు వరదతో ఆగమయ్యారు.
Armoor Flood | ఇంటి ముంగిట మృత్యురాయి..
గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా కమలా నెహ్రూ కాలనీలో (Kamala Nehru Colony) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఎడతెరపీయని వర్షాల వల్ల పక్కనే ఉన్న కొండపై ఉన్న మట్టి కొట్టుకుపోయింది. దీంతో కొండపై ఉన్న రాళ్లు అదుపు తప్పుతున్నాయి.
ఇలా అదుపు తప్పిన ఓ భారీ బండరాయి దొర్లుకుంటూ కిందికి దొర్లుకుంటూ వచ్చింది. నేరుగా కింద ఉన్న ఓ ఇంటి గోడను ఢీ కొని ఆగిపోయింది. వర్షం వల్ల ఆ ప్రాంతంలో బయట ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Armoor Flood : గోడ, డోర్‌ను ఢీకొని..
ఇక భారీ బండరాయి ఇంటి గోడను ఢీ కొనడంతో ఆ నివాసంలో ఉన్న ఇంటివారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఏమైందో తెలియక బయటకు పరుగులు తీద్దామని డోర్ వద్దకు రాగా.. తలుపు కూడా ధ్వంసం అయిందని గుర్తించి భయాందోళనకు లోనయ్యారు.
స్థానికుల సాయంతో అతి కష్టం మీద బయటకు వచ్చారు. ఇంటి బయటకు వచ్చిన ఆ కుటుంబీకులు.. తలుపునకు ఎదురుగా ఉన్న భారీ బండరాయిని చూసి కంగుతిన్నారు.
జరిగిన విషయాన్ని గ్రహించి ఒకింత భయపడినా.. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడినందుకు ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే ఇంకాస్త వేగంతో ఆ రాయి దొర్లుకుంటూ వస్తే.. ఆ కుటుంబంతో సహా ఇంటిని నేల మట్టం చేసేది.
సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ రాజు (Armoor Municipal Commissioner Raju) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లోని వారిని పునారవాస కేంద్రానికి తరలించారు. బండరాయిని తొలగింపజేస్తామని కమిషనర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.