ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCM Revanth Reddy | కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్​ రెడ్డి ఏరియల్​ సర్వే

    CM Revanth Reddy | కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్​ రెడ్డి ఏరియల్​ సర్వే

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : CM Revanth Reddy | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy Rains) కామారెడ్డి, మెదక్​ జిల్లాలు (Kamareddy and medak Districts) అతలాకుతలం అయ్యాయి. జిల్లాలోని కామారెడ్డి, జుక్కల్​, ఎల్లారెడ్డిలలో వర్షం బీభత్సం సృష్టించింది.

    రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలను సీఎం రేవంత్​రెడ్డి (CM Reavanth Reddy) హైదరాబాద్​ నుంచి మానిటరింగ్​ చేశారు. వర్షధాటికి చాలా చోట్ల చెరువులు తెగిపోయాయి. అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లాయి. దీంతో అధికార యంత్రాంగం స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. పలుచోట్ల వరదల్లో చిక్కుకున్న బాధితులను ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బృందాలు రక్షించాయి.

    CM Revanth Reddy | సీఎం ఏరియల్​ సర్వే..

    రాష్ట్రంలో మెదక్​, కామారెడ్డి జిల్లాలో వరద కారణంగా అపారమైన నష్టం వాటిల్లింది. దీంతో సీఎం ప్రత్యక్షంగా ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు ఏరియల్​ సర్వే (aerial survey) నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్​ (Hyderabad) నుంచి ప్రత్యేక హెలీకాప్టర్​లో బయలుదేరారు. మెదక్​తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్​లో ముంపు ప్రాంతాలను హెలీకాప్టర్​ నుంచే వీక్షించారు. అలాగే పోచారం, నిజాంసాగర్​ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం మెదక్​కు వెళ్లారు. అక్కడి ​లోని కలెక్టరేట్​లో భారీవర్షాలపై సమీక్ష చేయనున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...