ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHeavy Rains | వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యేలు..

    Heavy Rains | వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యేలు..

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​/ఎల్లారెడ్డి: Heavy Rains | నియోజకవర్గాల్లో రెండురోజులు కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలన్ని అతలాకుతలమయ్యాయి.

    వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు వరదను వదిలిపెడ్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా.. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

    దీంతో జుక్కల్​, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు మదన్​మోహన్​ రావు (Mla Madan Mohan Rao), లక్ష్మీకాంతారావులు (Mla Laxmi Kantha Rao) క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

    Heavy Rains | నిజాంసాగర్​ మండలంలో..

    జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం ఉదయం నుంచి నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. ముంపునకు గురవుతున్న గ్రామాలతో పాటు బొగ్గు గుడిసెను సందర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి (Nizamsagar Project) ఎగువ భాగం నుంచి భారీ ఇన్​ఫ్లో ప్రవహిస్తుండడంతో మంజీర ప్రాంతంలోని గ్రామాల గురించి అధికారులతో మాట్లాడారు.

    నిజాంసాగర్ మండలంతో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటిస్తూ అధికారులను సమన్వయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని తెలుసుకుంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆయనతోపాటు బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు పండరి, తదితరులున్నారు.

    Heavy Rains | ఎల్లారెడ్డిలో విద్యుత్ పునరుద్ధరణకు ఎమ్మెల్యే చొరవ..

    తీవ్ర వర్షాల కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (Yella Reddy Constituency) అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులను ఎప్పటికప్పడు సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.

    విద్యుత్ శాఖ (Electricity Department) ముఖ్య ఇంజినీర్​తో ఫోన్​లో మాట్లాడారు. నియోజకవర్గంలో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్​ మరమ్మతుల నిమిత్తం బృందాలను వెంటనే రంగంలోకి దింపి విద్యుత్​ పునరుద్ధరణ పనులు నిర్వహించాలని కోరారు.

    విద్యుత్​శాఖ ఎస్​ఈతో మాట్లాడుతూ విద్యుత్​ మరమ్మతులు వెంటనే పూర్తిచేయాలని కోరుతున్న ఎమ్మెల్యే మదన్​మోహన్​

    సహాయక చర్యలను పర్యవేక్షించిన కాసుల బాల్​రాజ్​

    అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో వరద కారణంగా డ్రెయినేజీల్లో పూడిక పూర్తిగా నిండిపోయింది. దీంతో రహదారులపై మురికినీరు ఏరులై పారింది.

    దీంతో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ పలు ప్రాంతాలను పర్యవేక్షించారు. మున్సిపల్​ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్‌బీఐ, హోండా షోరూమ్ పరిసరాలు నీట మునగడంతో మున్సిపల్ సిబ్బందితో తక్షణం చర్యలు చేపట్టారు.

    పంపింగ్ మిషన్లు, డ్రెయినేజీ మార్గాల ద్వారా నీటిని తొలగించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో కలిసి సాయికృపా నగర్‌లో పర్యటించారు.

    చెరువు నిండిపోవడం, ప్రవాహం పెరగడం గమనించి చెరువు సురక్షితంగా ఉండేలా మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ ఇంజినీర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

    బాన్సువాడ నగరంలో వరద పరిస్థితిని సమీక్షిస్తున్న కాసుల బాల్​రాజ్​

    Latest articles

    August 29 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 29 Panchangam : తేదీ (DATE) – 29 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...

    Rescue team rescued | జల దిగ్బంధంలో కందకుర్తి ఆశ్రమం.. చిక్కుకుపోయిన 8 మంది భక్తులు.. రక్షించిన రెస్యూ బృందం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు...

    More like this

    August 29 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    August 29 Panchangam : తేదీ (DATE) – 29 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం (Sri Vishwa...

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...