ePaper
More
    HomeజాతీయంRajasthan | వైద్య చ‌రిత్ర‌లో అరుదైన సంద‌ర్భం.. 55 ఏళ్ల వ‌య‌స్సులో 17వ కాన్పు

    Rajasthan | వైద్య చ‌రిత్ర‌లో అరుదైన సంద‌ర్భం.. 55 ఏళ్ల వ‌య‌స్సులో 17వ కాన్పు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rajasthan | వైద్య చ‌రిత్ర‌లో (medical history) అరుదైన సంద‌ర్భం చోటు చేసుకుంది. 55 ఏళ్ల వ‌య‌స్సున్న ఓ మ‌హిళ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇది ఆమెకు 17వ కాన్పు కావ‌డం విశేషం.

    వైద్య రంగంలో అరుదైన ఉదంతంగా మారిన ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ (Rajasthan) రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఒకరు, ఇద్ద‌రిని క‌ని పెంచ‌డ‌మే భారంగా మారిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆమె 17 మందికి జ‌న్మ‌నివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 55 ఏళ్ల వ‌య‌స్సులో 17 వ సారి విజయవంతంగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వార్త సోష‌ల్ మీడియాలో (Social Media) వైర‌ల్‌గా మారింది.

    Rajasthan | అమ్మ‌మ్మ అమ్మ‌గా మారి..

    రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ జిల్లా (Udaipur district) లీలావాస్ గ్రామానికి చెందిన క‌వారా రామ్ క‌ల్బేలియా, రేఖ క‌ల్బెలియా(55) దంప‌తుల‌ది నిరు పేద కుటుంబం. చెత్త ఏరుకుంటూ జీవ‌నం సాగించే ఈ దంప‌తుల‌కు 16 మంది సంతానం. వీరిలో న‌లుగురు కుమారులు, ఓ కుమార్తె పుట్టిన స‌మ‌యంలోనే మృతి చెందారు. మిగ‌తా వారిలో ముగ్గురు కుమార్తెల‌కు, ఇద్ద‌రు కుమారులకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. వాళ్ల‌కు ఒక్కొక్క‌రికి ఇద్ద‌రు, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. అమ్మ‌మ్మ‌గా మారిన రేఖ మ‌రోసారి గ‌ర్భం దాల్చింది.

    ఇటీవ‌ల పురిటినొప్పులతో ఆస్పత్రికి వెచ్చిన రేఖ.. నాలుగో ప్రసవం అని వైద్యులకు అబద్ధం చెప్పి ఆస్పత్రిలో చేరినట్లు జాడోల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గైనకాలజిస్ట్ అయిన రోషన్ దరంగి తెలిపారు. గతంలో 16 మందికి జన్మనిచ్చిన ఆమె.. తాజాగా 17వ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 17వ కాన్పు (17th birth) గురించి తెలిసి వైద్యులు షాక్‌కు గుర‌య్యారు. వ‌రుస కాన్పుల వ‌ల్ల అధిక ర‌క్త‌స్రావం జ‌రిగి త‌ల్లి ఆరోగ్యానికి ముప్పు ఉంటుంద‌ని, కానీ ఈ కేసులో రేఖ ఆరోగ్యంగా ఉన్నార‌ని డాక్ట‌ర్లు చెప్పారు.

    Rajasthan | అప్పులు తెచ్చి బిడ్డ‌ల్ని పోషించి..

    పిల్ల‌ల్ని పెంచ‌డానికి నిరుపేద తండ్రి రామ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త ఎరుకుని జీవ‌నం సాగించే అత‌డు అప్పు తెచ్చి పిల్ల‌ల్ని పోషిస్తున్నాడు. ఏకంగా 20 శాత వ‌డ్డీకి అప్పు తెచ్చాన‌ని వాపోయాడు. 17 మందిని జ‌న్మ‌నిచ్చిప్ప‌టికీ, ఆర్థిక ప‌రిస్థితుల వ‌ల్ల ఏ ఒక్క‌రికి కూడా స్కూల్‌కు పంపించ‌లేదని తెలిపాడు. రామ్‌, రేఖ (Ram and Rekha) దంప‌తుల కుమార్తెల్లో ఒక‌రైన శిలా కల్బెలియా త‌మ ద‌యానీయ స్థితిని వివ‌రిస్తూ.. ప్రభుత్వమే త‌మ‌ను ఆదుకోవాల‌ని కోరింది. తమకు ఇళ్లు లేదని, పిల్లల్ని చదివించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

    Latest articles

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...

    Rescue team rescued | జల దిగ్బంధంలో కందకుర్తి ఆశ్రమం.. చిక్కుకుపోయిన 8 మంది భక్తులు.. రక్షించిన రెస్యూ బృందం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు...

    CM Revanth Reddy’s review | మెదక్‌ ఎస్పీ కార్యాలయంలో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి రివ్యూ.. ఏమేమి చర్చించారంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy's review | వరద ప్రభావంపై మెదక్‌ ఎస్పీ కార్యాలయం (Medak SP...

    More like this