అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు.
నగర శివారులోని చంద్రశేఖర్ కాలనీ (Chandrasekhar Colony), న్యాల్కల్ రోడ్డు (Nyalkal Road), అర్సపల్లి (Arsapalli), ఆటో నగర్, తదితర కాలనీలో వర్షం నీరు చేరింది. అలాగే పూలాంగ్ వాగులో నీటి ప్రవాహం పెరగడంతో విశ్వశాంతి పాఠశాల నుంచి వినాయక్ నగర్‌కు వెళ్లే దారిలో వంతెన పూర్తిగా మునిగింది.
Nizamabad City | కోర్టు చౌరస్తా ఏరియాలో..
కోర్టు చౌరస్తా నుంచి నటరాజ్ థియేటర్, ఎల్లమ్మ గుట్ట ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు.
రైల్వేస్టేషన్ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన నీరు
నగరంలోని విశ్వశాంతి కళాశాల నుంచి వినాయక్‌నగర్‌కు వెళ్లే వంతెన పూర్తిగా నీటమునిగిన దృశ్యం
నగరంలోని రేడియోస్టేషన్ ప్రాంతంలో రోడ్డుపై నిలిచిన నీళ్లు