ePaper
More
    Homeక్రైంMaharastra | కుప్ప కూలిన నాలుగు అంత‌స్థుల భ‌వ‌నం.. పెరుగుతున్న మృతుల సంఖ్య‌

    Maharastra | కుప్ప కూలిన నాలుగు అంత‌స్థుల భ‌వ‌నం.. పెరుగుతున్న మృతుల సంఖ్య‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Maharastra | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వాసాయి-విరార్ ప్రాంతంలోని రమాబాయి అపార్ట్‌మెంట్ కుప్పకూలింది. నాలుగు అంత‌స్తుల భ‌వనం కుప్ప‌కూలిన ఘటనలో 20 నుండి 25 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నారు.

    ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా, ఇందులో ఓ తల్లి, కుమార్తె (mother and daughter) కూడా ఉన్నారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 12:05 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. భవనంలోని వెనక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కొంత భాగం పక్కనే ఉన్న ఖాళీ భవనంపై పడింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ అపార్ట్‌మెంట్ (apartment) అనధికారంగా నిర్మించబడినదిగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు (NDRF teams) సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

    Maharastra | బాధితులను రక్షించేందుకు చర్యలు

    ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ NDRF 5వ బెటాలియన్‌కు చెందిన రెండు బృందాలు అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఇందూ రాణి జఖర్ (Palghar District Collector Indu Rani Jakhar) మాట్లాడుతూ, ఇంకా శిథిలాల కింద మరికొంత మంది ఉండే అవకాశం ఉందని తెలిపారు. ముందు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల్లోని ఇతర నివాస సముదాయాలను ఖాళీ చేసి, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    జిల్లా విపత్తు నిర్వహణ అధికారి వివేకానంద్ కదమ్ తెలిపిన ప్రకారం.. రమాబాయి అపార్ట్‌మెంట్ 2012లో నిర్మించబడింది. ఇందులో మొత్తం 50 ఫ్లాట్‌లు ఉండగా, కూలిపోయిన భాగంలో 12 అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ప్రారంభ దశలో భారీ యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకోలేకపోవడం వల్ల శిథిలాల తొలగింపు ఆలస్యమైందని వీవీఎంసీ అధికారులు పేర్కొన్నారు.

    వీవీఎంసీ VVMC అసిస్టెంట్ కమిషనర్ గిల్సన్ గోన్సాల్వ్స్ ప్రకారం.. మొదట రెస్క్యూ సిబ్బందితో మాత్రమే శిథిలాల తొలగింపు చేపట్టినా.. ప్రస్తుతం యంత్రాల సహాయంతో ఆపరేషన్ కొనసాగుతోంది. బాధిత కుటుంబాలను చందన్సార్ సమాజ్‌మందిర్‌లో తాత్కాలికంగా వసతులు కల్పించి, వారికి ఆహారం, నీరు, వైద్య సహాయం (water and medical assistance) అందిస్తున్నారు. వీవీఎంసీ ఫిర్యాదు మేరకు భవన నిర్మాణదారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ విషాద ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందించాల్సిన అవసరం ఉంది.

    Latest articles

    Nizamabad Floods | పులాంగ్, బోర్గాం​ వాగులకు పోటెత్తిన వరద.. నీట మునిగిన శ్రీ చైతన్య పాఠశాల, గుడిసెలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం (ఆగస్టు...

    YEllaReddy in waterlogging | కొట్టుకుపోయిన దారులు.. ఎల్లారెడ్డికి బాహ్య ప్రపంచంతో తెగిన బంధాలు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: YEllaReddy in waterlogging : వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాల వల్ల పలు కామారెడ్డి...

    Rescue team rescued | జల దిగ్బంధంలో కందకుర్తి ఆశ్రమం.. చిక్కుకుపోయిన 8 మంది భక్తులు.. రక్షించిన రెస్యూ బృందం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rescue team rescued | రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రిపగలు...

    CM Revanth Reddy’s review | మెదక్‌ ఎస్పీ కార్యాలయంలో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి రివ్యూ.. ఏమేమి చర్చించారంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy's review | వరద ప్రభావంపై మెదక్‌ ఎస్పీ కార్యాలయం (Medak SP...

    More like this