అక్షరటుడే, వెబ్‌డెస్క్: terrorists killed | భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులను భద్రతా దళాలు గురువారం మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) లోని బందిపొరా జిల్లా గురెజ్ సెక్టర్‌లో నౌషెహ్రా Nowshera నార్డ్ సమీపంలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) Line of Control (LoC) దాటి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు.
దీంతో వారిని భద్రతా దళాలు కాల్చిచంపాయని అధికారులు తెలిపారు. నౌషెహ్రా నార్ సమీపంలో చొరబాటుకు యత్నిస్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన దళాలు భారత భూభాగంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్న చొరబాటుదారుల గుంపుపై కాల్పులు జరిపాయి.
ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ తర్వాత, భద్రతా దళాలు చుట్టుపక్కల ప్రాంతంలో అదనపు చొరబాటుదారులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు లేవని నిర్ధారించుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
terrorists killed | ఆగస్టు నెలలోనే ఆరుగురి హతం
ఈ నెల ప్రారంభంలో ఆపరేషన్ అఖల్ Operation Akhal కింద జరిగిన ప్రత్యేక ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఎదురుకాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డారు. ఆ ఆపరేషన్‌లో మొత్తం ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఆగస్టు 2న, అఖల్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో సాయుధ ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాల నివేదికల నేపథ్యంలో ఆగస్టు 1న ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అత్యాధునిక నిఘా పరికరాలను వినియోగించామని అధికారులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులు టీఆర్ఎఫ్ TRF, ఎల్ఈటీ ఉగ్రసంస్థలకు చెందిన వారని తెలిపారు. పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ TRF గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా US కూడా టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించింది.