ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిrehabilitation center | మర్పల్లికి వరద తాకిడి.. పునరావాస కేంద్రానికి ప్రజల తరలింపు

    rehabilitation center | మర్పల్లికి వరద తాకిడి.. పునరావాస కేంద్రానికి ప్రజల తరలింపు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: rehabilitation center | నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ మండలం మర్పల్లి గ్రామంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (Jukkal MLA Thota Lakshmi Kantarao) వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆదేశించారు.

    rehabilitation center | హుటాహుటిన బయలుదేరి..

    బీహార్ Bihar ​లో జరుగుతున్న ఓటరు అధికార యాత్ర (voter empowerment tour) లో ఉన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన పర్యటనను విరమించుకొని హుటాహుటిన బయలుదేరి కామారెడ్డి జిల్లా జుక్కల్​ నియోజకవర్గానికి చేరుకున్నారు. స్థానికంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు.

    rehabilitation center | తాత్కాలిక పునరావాస కేంద్రం..

    గోర్గల్​లోని సొసైటీ ఫంక్షన్ హాల్​ను తాత్కాలిక పునరావాస కేంద్రంగా ఏర్పాట్లు చేశారు. అందులోకి బాధిత గ్రామ ప్రజలను తరలించారు. వృద్ధులకు, పిల్లలకు, మహిళలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.

    బాధితుల దగ్గరికి ఎమ్మెల్యే వెళ్లి వారి పరిస్థితి, ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అక్కడే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ప్రజలకు కావలసిన వైద్య సేవలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రంలో ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉంటామన్నారు.

    ప్రభుత్వం నుంచి బాధితులకు సహాయం అందేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భరోసా ఇచ్చారు. నిజాంసాగర్ మండలంలోని పెద్ద ఆరేపల్లి, లింగంపల్లి గ్రామాలకు వెళ్లి ప్రజలను కలిసి అక్కడి పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఏదైనా అవసరం అయితే తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టు (Nizamsagar project) ను పరిశీలించారు.

    ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో.. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్బంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.

    Latest articles

    Heavy rains | రాష్ట్రానికి భారీ వర్షసూచన.. కామారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయి వర్షపాతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heavy rains | రాష్ట్రంలో భారీ నుంచి అతి వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్​, నిర్మల్​...

    Nizamsagar | నిజాంసాగర్​కు భారీ వరద.. 24 గేట్ల ద్వారా నీటి విడుదల

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar | కామారెడ్డి, మెదక్​ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి వరద...

    gold Price on august 28 | మ‌ళ్లీ పైపైకి బంగారం ధ‌ర‌.. అమెరికా సుంకాల ప్ర‌భావ‌మేనా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: gold Price on august 28 | భారత్‌పై అమెరికా America కొత్తగా అమలు చేస్తున్న...

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis | యూఎస్‌ మార్కెట్లు(US markets) బుధవారం లాభాలతో ముగిశాయి. యూరోప్‌ మార్కెట్లు...

    More like this