ePaper
More
    HomeతెలంగాణBjp - Congress | కుల గ‌ణ‌న‌పై మైలేజ్ కోసం.. బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య డైలాగ్...

    Bjp – Congress | కుల గ‌ణ‌న‌పై మైలేజ్ కోసం.. బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య డైలాగ్ వార్‌..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP-Congress | జ‌న గ‌ణ‌న‌తో పాటు కుల గ‌ణ‌న(Caste Census) నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. చాలా రోజులుగా ఉన్న ఈ డిమాండ్‌కు మోదీ స‌ర్కారు(Modi Government) అనూహ్యంగా ఆమోదం తెలిపింది. అయితే, ఈ సంచ‌ల‌న నిర్ణ‌యంపై క్రెడిట్ ద‌క్కించుకునేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ పాకులాడుతున్నాయి. త‌మ పోరాటం వ‌ల్లే కుల గ‌ణ‌న ప్ర‌క‌ట‌న వ‌చ్చింద‌ని కాంగ్రెస్(Congress) చెబుతుంటే, అణ‌గారిన వ‌ర్గాల‌కు సామాజిక న్యాయం చేకూర్చేందుకే కేంద్రం ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంద‌ని బీజేపీ(BJP) చెబుతోంది. ఈ నేప‌థ్యంలో రెండు పార్టీల మ‌ధ్య డైలాగ్ వార్(Dialogue war) న‌డుస్తోంది.

    BJP-Congress | క్రెడిట్ కోసం కాంగ్రెస్ య‌త్నం..

    జ‌నాభా గ‌న‌ణ‌తో పాటు కుల గణనను కూడా చేప‌డ‌తామ‌న్న కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న ఆధిపత్య పోరుకు తెర లేపింది. పాలక బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ల‌బ్ధి కోసం పాకులాడుతున్నాయి. రాహుల్‌గాంధీ(Rahul Gandhi) పోరాటం వ‌ల్లే కేంద్రం దిగివ‌చ్చింద‌ని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇది త‌మ నాయకుడి పోరాటానికి ద‌క్కిన విజయమ‌ని తెలిపింది. “కులాల వారీగా లెక్క‌లు తీయాల‌ని రాహుల్‌గాంధీ ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ(BJP) చేయ‌క‌పోతే తాము అధికారంలోకి వ‌చ్చాక చేస్తామ‌ని చెప్పార‌ని” జైరామ్ రమేశ్(Jairam Ramesh) గుర్తు చేశారు. స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ఆర్థిక‌ స్థితిగ‌తుల‌ను ప్ర‌తిబింబించే కుల గణ‌న చేయాల‌ని మా నాయ‌కుడు రాహుల్‌గాంధీ అడిగితే కేంద్రంలోని పెద్ద‌లు ఎగ‌తాళి చేశార‌ని “ఎక్స్‌”లో తెలిపారు. “రాహుల్‌గాంధీ పార్ల‌మెంట్‌(Parliament)లో, బ‌య‌టా చాలాకాలంగా కుల గ‌ణ‌న‌ కోసం డిమాండ్ చేస్తున్నాడు. త‌మ హ‌క్కుల కోసం మిలియ‌న్ల మంది అడుగుతుంటే ప్ర‌భుత్వం ఎంత‌కాలం అణ‌చివేస్తుంది. ఇప్ప‌టికైనా దిగివ‌చ్చిన మోదీ ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న(Caste Census) నిర్వ‌హించ‌డానికి అంగీక‌రించింద‌ని” హ‌ర్షం వ్య‌క్తం చేశారు. వెనుక‌బడిన వ‌ర్గాలకు స‌మాన‌త్వం, స‌రైన ప్రాతినిథ్యం ల‌భించ‌డంలో ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంద‌ని చెప్పారు.

    BJP-Congress | కొట్టిప‌డేసిన బీజేపీ..

    కాంగ్రెస్ వైఖ‌రిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. కుల-ఆధారిత జనాభా లెక్కలపై కాంగ్రెస్ పార్టీ వైఖ‌రిని బిజెపి ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా(Amit Malviya) విమ‌ర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు కుల-ఆధారిత జనాభా గణనను తీవ్రంగా వ్యతిరేకించాయి. స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం, కుల గ‌ణ‌న చేయ‌లేదని” గుర్తు చేశారు. కుల గ‌ణ‌నను కాంగ్రెస్‌, దాని అనుబంధ ప‌క్షాలు రాజ‌కీయ ప్ర‌యోజనo కోసం వాడుకున్నాయ‌ని విమర్శించారు. మ‌రోవైపు కేంద్ర నిర్ణ‌యంపై క్రెడిట్ కోసం కాంగ్రెస్ పాకులాడుతోంద‌ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు(Union Minister Kiren Rijiju) కూడా మండిప‌డ్డారు. “కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందో అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాని” రిజిజు అన్నారు. “కుల జనాభా లెక్కలు, రిజర్వేషన్లను కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. పీఎం నరేంద్ర మోడీ(PM Narendra Modi)దీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ మరేమీ మాత్రమే మాట్లాడదు” అని మండిప‌డ్డారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...