అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడడంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. మెదక్ (Medak), కామారెడ్డి (Kamareddy) జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి స్పందించారు.
CM Revanth Reddy | అప్రమత్తంగా ఉండాలని సూచన..
వర్షాలు కురుస్తున్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితిని సీఎం రేవంత్రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మెదక్, కామారెడ్డి జిల్లాల్లో (Kamareddy Collector Ashish Sangwan) యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు.
CM Revanth Reddy | అన్ని విభాగాలు సర్వసన్నద్ధంగా ఉండాలి..
ఈ రెండు జిల్లాల్లో ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు, అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అనుకోని పరిస్థితి ఎదురైతే వెంటనే అవసరమైన సహాయక చర్యలను చేపట్టాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) బృందాల సాయం తీసుకోవాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
CM Revanth Reddy | కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో..
భారీవర్షాలు కామారెడ్డి, మెదక్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే లింగంపేటలో (Lingamper) పలు చెరువులు తెగిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరదలో పలువురు చిక్కుకోవడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) పర్యవేక్షణలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmai) అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాలకు చేరుకుని సమీక్షించారు. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) నిర్వహించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తరలించారు.