అక్షరటుడే, నెట్వర్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో వర్షాలతో ఒకరు మృతి చెందారు. రాజంపేట మండల కేంద్రంలో రికార్డు స్థాయిలో 423మి. మీ. వర్షపాతం నమోదు అయింది. దేవుని చెరువు కట్ట తెగిపోవడంతో నీటి ప్రవాహానికి గోడ కూలి రాజంపేట మండలం గుండారం పల్లె దవఖానా డాక్టర్ వినయ్ కుమార్ మృతి చెందాడు.

Heavy Rains | ఐదుగురిని కాపాడిన సిబ్బంది
బొగ్గుగుడిసె సమీపంలో వరదలో చిక్కుకున్న ఎనిమిది బీహారీ కార్మికుల్లో ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మరో ముగ్గురిని రక్షించడానికి యత్నిస్తున్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే కల్యాణి వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు కాపాడాయి.
