ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిProjects | ఎస్సారెస్పీ, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత

    Projects | ఎస్సారెస్పీ, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్​/నిజాంసాగర్​ : Projects | రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. దీంతో ప్రాజెక్ట్​లకు వరద పోటెత్తింది. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్​సాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు ఎగువ నుంచి ఇన్​ఫ్లో వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

    స్థానికంగా కురిస్తున్న వర్షాలతో శ్రీరామ్​సాగర్ (Sriram Sagar)​లోకి ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం మధ్యాహ్నం అధికారులు జలాశయం వరద గేట్లు మూసివేశారు. మంగళవారం రాత్రి నుంచి ఇన్​ఫ్లో పెరుగుతుండటంతో బుధవారం ఉదయం గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదలను ప్రారంభించారు.

    Projects | 8 గేట్లు ఎత్తివేత

    శ్రీరామ్​సాగర్​ 8 వరద గేట్లను ఎత్తి అధికారులు గోదావరి (Godavari)లోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80.053 టీఎంసీల నీరు ఉంది. 8 వరద గేట్ల ద్వారా 25 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువకు 20 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3,500, ఎస్కేప్​ గేట్ల ద్వారా 2 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలీసాగర్​ ఎత్తిపోతల పథకానికి 360 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతలకు 270, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.

    Projects | నిజాంసాగర్​ 11 గేట్లు..

    Projects
    నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ గేట్ల ద్వారా విడుదల అవుతున్న నీరు

    మెదక్​, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి కుండపోత వాన పడుతోంది. అతి భారీ వర్షాలతో మంజీర (Manjira) నదికి వరద పోటెత్తింది. దీంతో నిజాంసాగర్ (Nizam Sagar)​ జలాశయంలోకి భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 82,306 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అధికారులు 11 గేట్ల ద్వారా 1,06,161 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్​ ప్రధాన కాలువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.788 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి వరద మరింత పెరిగే అవకాశం ఉంది.

    Projects | అప్రమత్తంగా ఉండాలి

    మంజీరకు వరద కొనసాగుతుండటంతో నిజాంసాగర్​ ద్వారా నీటి విడుదలను పెంచే అవకాశం ఉంది. దీంతో దిగువన నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజాంసాగర్​ నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీరామ్​సాగర్​కు వరద పెరగనుంది. దీంతో గోదావరిలోకి సైతం నీటి విడుదలను అధికారులు పెంచనున్నారు. ఈ క్రమంలో నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

    Latest articles

    Yellareddy | ఎల్లారెడ్డిలో వరద పరిస్థితిపై మంత్రి ఉత్తమ్​ సమీక్ష

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్​ (Medak), కామారెడ్డిలో (Kamareddy)...

    Pocharam Project | ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | భారీవర్షాల కారణంగా వరద తాకిడితో పోచారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి...

    kamareddy | కామారెడ్డి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: kamareddy | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ఎడతెరిపి...

    Heavy Rains | రాష్ట్రంలో ఆ జిల్లాలకు రెడ్​ అలర్ట్​.. ప్రజలు బయటకు రావొద్దని సూచన..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Heavy Rains | రాష్ట్రానికి వానగండం పట్టుకుంది. పలు జిల్లాల్లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి...

    More like this

    Yellareddy | ఎల్లారెడ్డిలో వరద పరిస్థితిపై మంత్రి ఉత్తమ్​ సమీక్ష

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్​ (Medak), కామారెడ్డిలో (Kamareddy)...

    Pocharam Project | ప్రమాదం అంచున పోచారం ప్రాజెక్టు..

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam Project | భారీవర్షాల కారణంగా వరద తాకిడితో పోచారం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి...

    kamareddy | కామారెడ్డి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: kamareddy | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ఎడతెరిపి...