అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sundarakanda | ‘సుందరకాండ’ అంటే మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేంది వెంకటేష్, మీనా, అపర్ణ హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ చిత్రం. 1992లో కె రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే టైటిల్‌తో నారా రోహిత్ (Nara Rohit) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టూడెంట్ ప్రేమను పొందడం కోసం లెక్చరర్‌గా మారిన మధ్య వయసు బ్రహ్మచారి కథే ‘సుందరకాండ’ చిత్రం. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
Sundarakanda | కథ
వయసు ముప్పై దాటినా ఇంకా పెళ్లి కాలేదనే ఒత్తిడిలో ఉన్న సిద్ధార్థ్ (నారా రోహిత్) జీవితం సింపుల్‌గానే కనిపిస్తుంది. అయితే పెళ్లి సంబంధాలన్నీ తిరస్కరించడానికి ఆయన దగ్గర స్పష్టమైన ఐదు రూల్స్ ఉన్నాయి. ఆ ఐదు లక్షణాలన్నీ స్కూల్ డేస్ లో (crush) అయిన వైష్ణవి (శ్రీదేవి విజయ్ కుమార్) ను చూసి నిర్ణయించుకున్నవే. ఒక రోజు ఎయిర్‌పోర్ట్‌లో ఐరా (వృతి వాఘాని) అనే యువతిని కలవడం, ఆమెలో ఆ లక్షణాలన్నీ కనిపించడం… అంతటితో కథ ఆగదు. వయసు వ్యత్యాసం, మరికొన్ని సమస్యలు వారి ప్రేమ కథకి అడ్డంగా నిలుస్తాయి. అసలు సిద్ధార్థ్ జీవితం ఎలా మలుపు తీసుకుంది? పెళ్లి కాలేదు అనే ఒత్తిడికి చెక్ పెట్టాడా? అనేది తెరపై చూడాల్సిందే.
Sundarakanda | నటీనటుల పర్‌ఫార్మెన్స్
నారా రోహిత్ మళ్లీ తన నేచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయన నటనలో మెచ్యూరిటీ కనిపించింది. వృతి వాఘాని (Vriti Vaghani) పాత్ర తక్కువగా ఉన్నప్పటికీ, తన అమాయకత్వంతో ఎప్పటికప్పుడు క్యూట్నెస్గా అనిపించింది. శ్రీదేవి విజయ్ కుమార్ స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారీ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది. సపోర్టింగ్ క్యాస్ట్‌లో నరేష్, వాసుకి, అభినవ్ గోమఠం, సత్య, సునైనా తమ పాత్రలలో నటించి మెప్పించారు.
సాంకేతికంగా చూస్తే..
లియోన్ జేమ్స్ సంగీతం సినిమాకు చాలా పెద్ద బలం. కొన్ని పాటలు బాగానే ఉన్నాయి. ప్రదీష్ వర్మ సినిమాటోగ్రఫీ సినిమాకు ఆహ్లాదకరమైన విజువల్స్ అందించింది. డైలాగ్స్ సాదాగా అనిపించిన లోతైన భావాలు పలికించాయి. ఎడిటింగ్‌లో కొంచెం కట్ చేయాల్సిన అవసరం ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు.
నటీ నటులు: నారా రోహిత్, శ్రీదేవి విజయ్ కుమార్, వ్రితి వఘ్ని, సత్య, వాసుకి
సినిమా శైలి : తెలుగు, డ్రామా
దర్శకుడు : వెంకటేష్ నిమ్మలపూడి
వ్యవధి : 2 గంటల 17 నిమిషాలు
సంగీతం: లియోన్ జేమ్స్
ప్లస్ పాయింట్లు:
నారా రోహిత్ కామెడీ టైమింగ్
సత్య & సునైనా జంట కామెడీ సీన్లు
వినూత్న కాన్సెప్ట్
స్క్రీన్ ప్లే
సంగీతం, విజువల్స్
మైనస్ పాయింట్లు :
కథలో పెద్దగా కొత్తదనం లేదు
ట్విస్టులు అంచనా వేసేలా ఉంటాయి
నిడివి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు
క్లైమాక్స్ అంత బలంగా అనిపించదు
Sundarakanda | చివరిగా..
‘సుందరకాండ’ ఒక హాయిగా సాగిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ప్రేమ, పెళ్లి, జీవితంకి సంబంధించిన విషయాలన్నింటిని హాస్యంతో కలిపి అందించిన సినిమా ఇది. సీరియస్ డ్రామాలా కాకుండా క్లీన్ కామెడీ, ఓ హృద్యమైన కథతో మంచి ఫ్యామిలీ ఫిలిం చూడాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక. గణేశ్ చతుర్థి సందర్భంగా కుటుంబంతో కలిసి చూసి సరదాగా చూడదగిన చిత్రం. ‘సుందరకాండ’ కథ పాయింట్ సింపుల్ అయినా ఓ నవల చాప్టర్‌లా సాగుతుంది. ఒక మిడ్-ఏజ్ మాన్‌ను హీరోగా తీసుకొని, అతని పెళ్లి కష్టాలను వినోదాత్మకంగా, భావోద్వేగాలతో మిళితం చేస్తూ చెప్పడం దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి బాగానే చూపించాడు అని చెప్పాలి. కమర్షియల్ హంగులు ఎక్కువగా లేకపోయినా, కథకి అవసరమైన ఎమోషన్లు, హ్యూమర్ బాగా పని చేశాయి. ముఖ్యంగా స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు, ప్రేమ కథలో టెండర్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
రేటింగ్ 3.25 / 5