ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala ghat road | తిరుమల ఘాట్ రోడ్డులో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఊడిన ఆర్టీసీ...

    Tirumala ghat road | తిరుమల ఘాట్ రోడ్డులో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఊడిన ఆర్టీసీ బస్సు టైర్..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: tirumala ghat road : తిరుమల Tirumala ఘాట్ రోడ్డులో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది.

    తిరుమల నుంచి తిరుపతి Tirupati కి బయలుదేరిన ఆర్టీసీ సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సు.. ఘాట్ రోడ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఊహించ‌ని ప్ర‌మాదం జ‌రిగింది.

    మంగ‌ళ‌వారం (ఆగస్టు 26) సాయంత్రం సమయంలో 57వ మలుపు వద్దకు రాగానే బస్సు ముందు చక్రం అకస్మాత్తుగా ఊడిపోయింది. ఈ క్ర‌మంలో బ‌స్సు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికుల్లో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది.

    tirumala ghat road : పెద్ద ప్రమాదం త‌ప్పింది..

    కాగా, డ్రైవర్ Driver చాకచక్యం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. వేగం తక్కువగా ఉండటంతో అతడు వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపేశాడు. బస్సులో ప్రయాణిస్తున్న భక్తులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

    ఈ ఘటన అనంతరం అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులందరినీ మరో బస్సులో తిరుపతికి తరలించారు. డ్రైవర్ తక్షణ స్పందనతో ప్రాణాపాయం నుంచి భక్తులందరూ తప్పించుకున్నారు.

    కాగా, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బస్సుల నిర్వహణ, టెక్నికల్ ఇన్స్పెక్షన్లపై ఆర్టీసీ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు సాంకేతిక లోపంపై దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

    తిరుమల ఘాట్ రోడ్డులో భద్రతా ప్రమాణాలు పెంచాలన్న డిమాండ్, ఈ ఘటనతో మళ్లీ చర్చనీయాంశమైంది. అందువల్ల, ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యమిస్తూ సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ Demand వెల్లువెత్తుతోంది.

    Latest articles

    CM Revanth Reddy | కామారెడ్డి, మెదక్​ క​లెక్టర్లు అలర్ట్​గా ఉండండి.. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం బలపడడంతో రాష్ట్రంలోని కొన్ని...

    Heavy Rains | వరదల్లో చిక్కుకున్న పలువురు.. కాపాడిన పోలీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Heavy Rains | జుక్కల్​ నియోజవర్గాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయాయి....

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. పలు రైళ్ల దారి మళ్లింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | భారీ వర్షాలకు కామారెడ్డి (Kamareddy) సమీపంలో రైల్వే ట్రాక్ (Railway...

    Heavy Rains | మెదక్​ జిల్లాను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న పలు గ్రామాలు

    అక్షరటుడే, మెదక్ : Heavy Rains | మెదక్​ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం...

    More like this