ePaper
More
    Homeజాతీయంdog carrying babys head | హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆసుపత్రి ఆవరణలో కుక్క నోట‌...

    dog carrying babys head | హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆసుపత్రి ఆవరణలో కుక్క నోట‌ శిశువు తల

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: dog carrying babys head : పంజాబ్ Punjab రాష్ట్రంలోని పాటియాలా జిల్లా కేంద్రంలో ఉన్న రాజేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి Rajindra Government Hospital ఆవరణలో హృద‌య విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది.

    ఓ కుక్క నవజాత శిశువు తలను నోట కరచుకుని ఆసుపత్రి పరిసరాల్లో సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు భయంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

    మంగ‌ళ‌వారం (ఆగస్టు 26) సాయంత్రం 5:30 గంటల సమయంలో.. ఆసుపత్రి వార్డు నంబరు 4 సమీపంలో ఓ వీధికుక్క శిశువు newborn baby తలతో తిరుగుతూ కనిపించిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించడంతో.. అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు.

    dog carrying babys head : కుక్క నోట ప‌సికందు త‌ల‌..

    ఈ ఘటనపై పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సింగ్ Punjab Health Minister Balbir Singh తీవ్రంగా స్పందించారు. “ఇది మానవత్వానికి మచ్చ. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని విడిచిపెట్టం. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజాలను వెలికి తీయాలి..” అని ఆయన అధికారులను ఆదేశించారు.

    శిశువు తలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపించామని, కేసును అత్యంత కీలకంగా తీసుకుని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విశాల్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ.. “ఈ మ‌ధ్య కాలంలో జన్మించిన శిశువులు క్షేమంగా ఉన్నారు. ఎవరూ తప్పిపోలేదు. గతంలో మృతి చెందిన ముగ్గురు శిశువుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాం. ప్రాథమికంగా చూస్తే శిశువు మృతదేహాన్ని బయటి నుంచి ఆసుపత్రి ఆవరణలో వదిలి ఉంటారు అనే అనుమానం ఉంది..” అని తెలిపారు.

    పాటియాలా ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. “కుక్క నోట కనిపించినది నిజంగానే నవజాత శిశువు తల అని వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నాం. ఆసుపత్రి నుంచి మృతి చెందిన శిశువుల వివరాలు, తల్లిదండ్రుల సమాచారం సేకరిస్తున్నాం. కేసు నమోదు చేశాం. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

    ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి ఘోరమైన ఘటన జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    శిశువుల భద్రతపై అధికారులు మరింత జాగ్రత్త వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి, పాటియాలాలో జరిగిన ఈ అమానవీయ ఘటన ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది.

    Latest articles

    Railway Track | భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్​.. నిలిచిపోయిన పలు రైళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Track | కామారెడ్డి (Kamareddy) జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం...

    Relationship | మీ వైవాహిక జీవితంలో శాంతి లేదా.. ఇవి మానుకోండి

    అక్షరటుడే, హైదరాబాద్ : Relationship | ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన ఘట్టం. భార్యాభర్తల మధ్య...

    Nizamsagar | అతలాకుతలం చేస్తున్న వర్షాలు.. వరదలో చిక్కుకున్న బిహారీ కూలీలు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar | భారీ వర్షాల కారణంగా జుక్కల్​ నియోజకవర్గం అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి...

    CM Revanth Reddy | భారీ వర్షాలు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు (Heavy...

    More like this