అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals) సందర్భంగా నిజామాబాదు నగరంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు మంగళవారం (ఆగస్టు 26) రాత్రి పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (Police Commissioner P. Sai Chaitanya) ఫుట్ వాకింగ్ (పెట్రోలింగ్) చేశారు.
నగరంలోని ముఖ్య గణేష్ మండపాలు, ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులతో సమీక్షించారు.
CP Foot Patrolling : శాంతియుతంగా నిర్వహించుకోవాలి
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతియుతంగా పండగను నిర్వహించుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఎక్కడెక్కడ పర్యటించారంటే..
వన్ టౌన్ నుంచి నెహ్రూ పార్క్, పెద్ద పోస్ట్ ఆఫీస్, లక్ష్మీ మెడికల్, పెద్ద బజార్, ఆర్.ఆర్. చౌరస్తా, వినాయకుల బావి, వీక్లీ మార్కెట్, పోచమ్మ గల్లి రవితేజ గణేష్ మండపం మొదలగు ప్రాంతాలలో సీపీ పర్యటించారు. ఆయన వెంట ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తదితరులున్నారు.