అక్షరటుడే, ఇందూరు: Vinayaka Chavithi | వినాయక చవితి నేపథ్యంలో రోడ్లన్నీ సందడిగా మారాయి. నగరంలోని పెద్ద బజార్ (Pedda bazar), శివాజీ నగర్ (Shivaji nagar), గోల్ హనుమాన్ (Goal Hanuman), అంగడిబజార్, గంజ్, గాంధీ చౌక్ తదితర ప్రాంతాలు పూజా సామాగ్రి క్రయవిక్రయదారులతో నిండిపోయాయి.
బిల్వపత్రాలు, మామిడి ఆకులు, కూరగాయలు, మారేడు దళాలు, ఎలక్కాయ, ఇస్తరాకులు తదితర సామగ్రిని నగరవాసులు కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా గణపతి ప్రతిమలను తరలిస్తూ చిన్నారులు, యువత బిజీగా మారారు. పలు భారీ వినాయకులు హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు.
Vinayaka Chavithi | నగరంలో పోలీసుల పహారా..
భారీ విగ్రహాలను మండపాలకు తరలిస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. భారీ విగ్రహాల తరలించే సందర్భంగా యువత నృత్యాలు చేస్తూ సాగుతుండడంతో పోలీసులు భద్రత కల్పించారు. అలాగే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సందడి నెలకొన్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూం (Command Control Room) ద్వారా పోలీసులు నిఘా పెట్టారు.
కూరగాయలను కొనుగోలు చేస్తున్న నగరవాసులు
నగరంలో భారీ వినాయకుడిని మండపానికి తరలిస్తున్న భక్తులు