ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిEco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలి

    Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Eco Friendly Vinayaka | పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Bodhan MLA Sudarshan Reddy), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. హెల్పింగ్ హార్ట్స్​ ఫౌండేషన్ (Helping Hearts Foundation) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్​లో మట్టి గణపతులను అందజేశారు.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను (Clay Ganeshas) ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) ఆధ్వర్యంలోనూ ప్రభుత్వపరంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పీవోపీ, రసాయన రంగులతో రూపొందించిన విగ్రహాల కారణంగా జలవనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు.

    కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ (Agricultural Commission) సభ్యుడు గడుగు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato), నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (Revenue Employees Services Association) జిల్లా అధ్యక్షుడు రమణ్​రెడ్డి (Raman reddy), కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ప్రభు, ఆయా శాఖల అధికారులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

    బాన్సువాడలోని బోర్లం ప్రాథమిక పాఠశాలలో..

    అక్షరటుడే, బాన్సువాడ: మండలంలోని బోర్లo ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు. ఈ సందర్భంగా హెచ్​ఎం గోపి మాట్లాడుతూ.. వినాయక చవితికి మట్టి గణపతులను మాత్రమే ఉపయోగించాలని, ఇవి పర్యావరణానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. అనంతరం మట్టి గణపతి తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయ్యల సంతోష్, చైతన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

    పోతంగల్​ మండల కేంద్రందలో..

    అక్షరటుడే, కోటగిరి: పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పోతంగల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మంగళవారం మట్టి గణపతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వామి వివేకానంద యూత్, ఈకో క్లబ్ ఆధ్వర్యంలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు గణనాథులను తయారు చేశారు. ఉత్తమంగా గణేషులను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు సుదాం భూమయ్య మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మట్టి గణపతులు తయారుచేసి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్, హెచ్​ఎం సాయిలు, మాజీ యూత్ అధ్యక్షులు సీతలే మోహన్, ఉపాధ్యాయులు, నాగ్ నాథ్, హన్మాండ్లు, వెంకటేశ్వర్ రెడ్డి, రామారావు, చందర్, శ్రీవాణి, ఇందిరా ప్రియ, యూత్ సభ్యులు, రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    నిజాంసాగర్​లో మట్టి వినాయకుల అందజేత

    అక్షరటుడే, నిజాంసాగర్: మండల కేంద్రానికి చెందిన దాత సత్యనారాయణ మంగళవారం మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుడి ప్రతిమలను పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. తన వంతు బాధ్యతగా మూడేళ్లుగా ఉచితంగా మట్టి వినాయకుడి ప్రతిమలను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    బాన్సువాడలోని బోర్లం పాఠశాలలో మట్టి వినాయకులను తయారు చేసిన విద్యార్థులు

    పోతంగల్​ మండలంలోని జెడ్పీహెచ్​ఎస్​లో మట్టిగణపతులతో విద్యార్థులు

    నిజాంసాగర్​ మండల కేంద్రంలో ఉచితంగా మట్టిగణపతులను అందజేస్తున్న దాత సత్యనారాయణ

    Latest articles

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    More like this

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...