అక్షరటుడే, కామారెడ్డి/ఇందూరు: Private Degree Colleges | తెలంగాణ యూనివర్సిటీ (Telanagana University) పరిధిలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నూతన కార్యవర్గాన్ని (Private college management committee) మంగళవారం ఎన్నుకున్నారు. కామారెడ్డిలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Private Degree Colleges | అధ్యక్షుడిగా జైపాల్‌రెడ్డి, కార్యదర్శిగా నరాల సుధాకర్..
ప్రైవేటు కళాశాలల యాజమాన్య కార్యవర్గం అధ్యక్షుడిగా కామారెడ్డి ఆర్కే కళాశాల (RK College) సీఈవో జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కేర్ డిగ్రీ కళాశాల (Care Degree College) అధినేత నరాల సుధాకర్, కోశాధికారిగా బోధన్ మీమ్స్ డిగ్రీ కళాశాల యజమాని శ్రీనివాస్ రాజును ఎన్నుకున్నారు.
ఉపాధ్యక్షులుగా డిచ్పల్లి ఎస్పీఆర్ కళాశాల యజమాని అరుణ్ రెడ్డి, బాన్సువాడ శశాంక్ డిగ్రీ కళాశాల యజమాని సయ్యద్ హకీం, సంయుక్త కార్యదర్శిగా సిద్దార్థ కళాశాల యజమాని నవీన్, లీగల్ అడ్వైజర్‌గా ప్రముఖ న్యాయవాది మాజీ పీపీ రాజేందర్ రెడ్డిని, రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా గురువేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత అధ్యక్ష, కార్యదర్శులుగా పనిచేసిన హరిప్రసాద్, సంజీవరెడ్డిలకు వీడ్కోలు సందర్భంగా ఘనంగా సన్మానించారు.
Private Degree Colleges | సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ప్రైవేటు కళాశాలల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా కళాశాలలు మూత పడుతున్నాయని తెలిపారు. కళాశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల అధికారులుగా కామారెడ్డి సాందీపని కళాశాల హరిస్మరణ్ రెడ్డి, బోధన్ ఉషోదయ కళాశాల సూర్యప్రకాశ్, ఆర్మూర్ నరేంద్ర కళాశాల శంకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో మారయ్య గౌడ్, హరి ప్రసాద్, సుజన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సంజీవ్, బాలాజీ, హకీం, విజయ్, గిరి, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.