అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anantapur District | తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి వేడుకల (Vinayaka Chavithi celebrations) మంగళధ్వని మార్మోగుతోంది. వినూత్నమైన సేవా రూపాల్లో చాలానే విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే ఈ ఏడాది అనంతపురం జిల్లా (Anantapur District) పామిడిలో ఒక ప్రత్యేకమైన గణపతి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది మామూలు విగ్రహం కాదు.సబ్బులు, షాంపూలతో తయారైన వినాయక విగ్రహం! వినాయక చవితి సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం విభిన్నంగా రూపొందించబడింది. సంతూర్, లక్స్, సింతాల్ వంటి ప్రముఖ సబ్బులే కాకుండా, మీరా, సన్‌సిల్క్, కార్తీక, కంఫర్ట్ వంటి షాంపూలు, సాఫ్ట్‌నర్స్‌తో ఈ విగ్రహాన్ని అలంకరించారు.
Anantapur District | వెరైటీ వినాయక..
ఈ విగ్రహం ప్రధాన శరీరం – సంతూర్ సబ్బులతో, చెవులు – లక్స్ సబ్బులతో, కాళ్లు – సింతాల్ సబ్బులతో, దంతాలు – మీరా షాంపూ ప్యాకెట్లతో (Meera shampoo packets), హారాలు & అలంకరణ – సన్‌సిల్క్, కార్తీక షాంపూలు మరియు కంఫర్ట్ ప్యాకెట్లతో రూపొందించారు. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించడానికి సుమారు రూ. 25,000 ఖర్చు చేసినట్టు నిర్వాహకులు తెలియజేశారు. సుమారు 10 మంది కళాకారులు దాదాపు 15 రోజుల పాటు కృషి చేసి, ఈ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ విగ్రహం ద్వారా నిర్వాహకులు కేవలం కొత్తదనం చూపినట్టే కాకుండా, పర్యావరణ హితానికి ఓ మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నారు. మట్టితో కాకుండా సబ్బులు, ఇతర కరిగిపోయే పదార్థాలతో విగ్రహాన్ని తయారు చేయడం ద్వారా నదుల కాలుష్యాన్ని (rivers Pollution) నివారించే ప్రయత్నం చేశారు.
రానున్న రోజులలో ఇది గణేశ్ విగ్రహాల (Ganesh Idols) డిజైన్లకు ప్రేరణగా మారనుంది. ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఒక వినూత్న ఆలోచనతో భక్తిని మేళవించిన ఈ ప్రయత్నం సోషల్ మీడియాలోనూ (Social Media) వైరల్ అవుతోంది. ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచీ కూడా విభిన్న విగ్రహాలపై ఆసక్తి పెరుగుతోంది.ఈ ప్రత్యేక గణపతిని రూపొందించిన నిర్వాహకులు మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం మేము భిన్నమైన థీమ్ ఎంచుకుంటాం. ఈసారి ‘శుభ్రతే దైవత్వానికి దారి’ అన్న కాన్సెప్ట్‌తో, సబ్బులు, షాంపూలతో గణేశుడిని తయారు చేశాం. ఇది ప్రజల్లో శుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు భక్తికి కొత్త రూపం కూడా అని అన్నారు