ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGGH Kamareddy | జీజీహెచ్​లోకి అంబులెన్స్​లు వెళ్లేదెట్లా..!

    GGH Kamareddy | జీజీహెచ్​లోకి అంబులెన్స్​లు వెళ్లేదెట్లా..!

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: GGH Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి (Government General Hospital) సమస్యలకు నిలయంగా మారింది. ఆస్పత్రిలో పార్కింగ్ (Parking)​ సమస్య తలనొప్పిగా మారింది. ఆస్పత్రి లోపలికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండడం.. లోపల కార్లు, ఆటోలు పార్కింగ్​ చేసి ఉంటుండడంతో అంబులెన్స్​లు వచ్చి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

    GGH Kamareddy | ఇరుకైన పార్కింగ్​..

    గురువారం మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వివిధ ప్రాంతాల నుంచి రోగులను తీసుకుని ఒకే సమయంలో మూడు 108 అంబులెన్సులు జీజీహెచ్(GGH)​కు వచ్చాయి. పార్కింగ్ స్థలంలో అప్పటికే వైద్యులకు సంబంధించిన కార్లు ఉన్నాయి. బైకులు, ఆటోలతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో రోగులను తీసుకుని వచ్చిన 108 వాహనాలు కనీసం అక్కడ యూటర్న్ తీసుకుని వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

    GGH Kamareddy | సెక్యూరిటీ సిబ్బందికి కష్టాలు..

    ఆస్పత్రి సెక్యూరిటీ (Hospital Security) సిబ్బంది అతికష్టం మీద బైక్​లను, ఆటోలను పంపించి 108 వాహనాల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. జీజీహెచ్​కు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో పాటు వాహనాల రద్దీ కూడా పెరిగింది. ఆస్పత్రిలో పార్కింగ్ స్థలం లేక వాహనాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పార్కింగ్ విషయం సెక్యూరిటీల గార్డులకు తలనొప్పిగా మారుతోంది. కొందరు వాహనదారులు సెక్యూరిటీపైకి దాడులకు యత్నించిన ఘటనలూ ఉన్నాయి. ఆస్పత్రిలో పార్కింగ్​ను క్రమబద్ధీకరించాలని.. అంబులెన్స్​లు వచ్చి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    India Alliance | సుప్రీం వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాల అస‌హ‌నం.. అసాధార‌ణ వ్యాఖ్య‌ల‌ని మండిపాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Alliance | లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్‌గాంధీపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇండి...

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    More like this