ePaper
More
    HomeజాతీయంPrime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో...

    Prime Minister Narendra Modi | ఎన్ని ఒత్తిళ్లున్నా మేమే భరిస్తాం.. అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prime Minister Narendra Modi : ప్రపంచ ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ..  రైతులు, చిరు వ్యాపారవేత్తలు, పశుపోషకుల ప్రయోజనాలను తమ ప్రభుత్వం కాపాడుతూనే ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు.

    అహ్మదాబాద్​లో సోమవారం (ఆగస్టు 25) జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. పరోక్షంగా అమెరికా సుంకాల(US tariffs)కు తలొగ్గబోమని స్పష్టం చేశారు. నేడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారన్నారు.

    ఈ క్రమంలో తమపై ఒత్తిడి పెరగవచ్చని, అయినప్పటికీ తాము భరిస్తామని స్పష్టం పీఎం చేశారు. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ మంగళవారం నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

    Prime Minister Narendra Modi : వారి ప్రయోజనాలే ముఖ్యం

    రైతులు, పశు పోశకులు, మత్స్యకారులు, చిరు వ్యాపారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మోడీ అన్నారు.

    “నేడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ అహ్మదాబాద్ గడ్డ నుంచి నా రైతులు, పశు పోషకులు, చిన్న వ్యాపారులకు ఒక్కటే హామీ ఇస్తున్నా. మీ ప్రయోజనాలే మోడీకి అత్యంత ముఖ్యమైనవి. నా ప్రభుత్వం మీకు ఎటువంటి హాని జరగనివ్వదు..” పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గుజరాత్ నుంచి బలమైన ఊపును పొందుతోందని, ఇది “రెండు దశాబ్దాల కృషి”పై నిర్మించబడిందన్నారు.

    Prime Minister Narendra Modi : పాకిస్తాన్ కు హెచ్చరికలు..

    పహల్గామ్ ఊచకోత నేపథ్యంలో ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి, పాకిస్తాన్ కు ప్రధాని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

    భారతదేశం ఇకపై ఉగ్రవాదులను, వారి యజమానులను విడిచిపెట్టదని పీఎం ప్రకటించారు. “ఆపరేషన్ సిందూర్ మన సైనికుల ధైర్యాన్ని, సుదర్శన చక్రధరి అయిన శ్రీకృష్ణుడి సంకల్పాన్ని ఇండియా ప్రతిబింబించింది. ఉగ్రవాదులు, వారి యజమానులు ఎక్కడ దాక్కున్నప్పటికీ మేము వారిని విడిచిపెట్టం” అని ప్రధాని స్పష్టం చేశారు.

    Prime Minister Narendra Modi : స్వదేశీ వస్తువులనే వాడుదాం..

    బలం, రక్షణకు ప్రతీక అయిన సుదర్శన్ చక్రధారి భగవంతుడు శ్రీకృష్ణుడు Lord Krishna, తన రాట్నంతో స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించిన స్వాతంత్య్ర ఉద్యమ వీరుడు చరఖాధారి మోహన్ మహాత్మా గాంధీ Charkhadhari Mohan Mahatma Gandhi మార్గంలో నడవడం ద్వారా ఇండియా సాధికారతను పొందిందని ప్రధాని అన్నారు.

    “మోడీకి రైతులు, పశువుల పెంపకందారులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలు చాలా ముఖ్యమైనవి. ఈ క్రమంలో మనపై ఒత్తిడి పెరగవచ్చు, కానీ మేము అన్నింటినీ భరిస్తాం” అని చెప్పారు.

    ప్రజలందరూ స్వదేశీ వస్తువులను విస్తృతంగా ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు. “మనమందరం ‘భారతదేశంలో తయారు చేసిన’ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనే మంత్రాన్ని పఠించాలి. వ్యాపారవేత్తలు కూడా తాము స్వదేశీ వస్తువులను మాత్రమే అమ్ముతామని తమ సంస్థల బయట ఒక పెద్ద బోర్డును ఉంచాలి ” అని మోడీ సూచించారు.

    Latest articles

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. పలు రైళ్ల దారి మళ్లింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | భారీ వర్షాలకు కామారెడ్డి (Kamareddy) సమీపంలో రైల్వే ట్రాక్ (Railway...

    Heavy Rains | మెదక్​ జిల్లాను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న పలు గ్రామాలు

    అక్షరటుడే, మెదక్ : Heavy Rains | మెదక్​ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం...

    Heavy Rains | వర్షాలకు ఒకరి మృతి.. వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడిన సిబ్బంది

    అక్షరటుడే, నెట్​వర్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో వర్షాలతో ఒకరు మృతి చెందారు. రాజంపేట మండల...

    Heavy Floods | కుండపోత వాన.. తెగిన చెరువులు.. కొట్టుకుపోయిన రోడ్లు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి/నిజాంసాగర్ ​: Heavy Floods | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానతో జిల్లా అతలాకుతలం అవుతోంది....

    More like this

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. పలు రైళ్ల దారి మళ్లింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | భారీ వర్షాలకు కామారెడ్డి (Kamareddy) సమీపంలో రైల్వే ట్రాక్ (Railway...

    Heavy Rains | మెదక్​ జిల్లాను ముంచెత్తిన వానలు.. వరదలో చిక్కుకున్న పలు గ్రామాలు

    అక్షరటుడే, మెదక్ : Heavy Rains | మెదక్​ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం...

    Heavy Rains | వర్షాలకు ఒకరి మృతి.. వరదలో చిక్కుకున్న పలువురిని కాపాడిన సిబ్బంది

    అక్షరటుడే, నెట్​వర్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో వర్షాలతో ఒకరు మృతి చెందారు. రాజంపేట మండల...