ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి చేయలేదు..

    Shabbir Ali | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోపిడీ తప్ప అభివృద్ధి చేయలేదు..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో (BRS) దోపిడీ తప్ప అభివృద్ధి ఊసే లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. భిక్కనూరు (Bhiknoor) మండలంలోని రైల్వే స్టేషన్ (Railway Station) గ్రామంలో సోమవారం సాయంత్రం పల్లె పనుల జాతర (Panula Jathara) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఆహార భద్రత కార్డులు పంపిణీ చేపట్టారు.

    అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురికి 60 లక్షల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామ గ్రామాన పనుల జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయన్నారు.

    బీఆర్ఎస్ పాలనలో గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి పంచాయతీ కార్యాలయాలు గాలికి వదిలేశారన్నారు. గతంలో గ్రామాల్లో ఉన్న సమస్యలు చెప్పుకుందామంటే నాయకుల జాడే కనపడలేదని, ఎవరైనా సమస్యలు చెప్పుకుందామంటే లంచాలతో పనులు చేస్తూ బెదిరింపులతో సమాధానం చెప్పేవారన్నారు.

    రాష్ట్రంలో బీఆర్​ఎస్​ హయాంలో ఒక్క రేషన్ కార్డు రాలేదని, పేదలకు ఇల్లు రాలేదని, బీఆర్ఎస్ నాయకులు మాత్రం లక్షాధికారులయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని.. వారి అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. అప్పులు చేసి ఆస్పత్రిపాలైన వారికి గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి ఆసరాగా నిలుస్తోందని చెప్పారు.

    Latest articles

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    More like this