ePaper
More
    HomeజాతీయంUnion Minister Shivraj | ఇది నయా భారత్.. ఎవరి బెదిరింపులకు లొంగదన్న కేంద్ర మంత్రి...

    Union Minister Shivraj | ఇది నయా భారత్.. ఎవరి బెదిరింపులకు లొంగదన్న కేంద్ర మంత్రి శివరాజ్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Union Minister Shivraj | ఎవరి ఒత్తిళ్లకు ఇండియా తలొగ్గదని, ఇది నయా భారత్ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Minister Shivraj Singh Chouhan) అన్నారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.

    భారత వస్తువులపై అమెరికా సుంకాలు (US tariffs)  విధించిన నేపథ్యంలో.. “వారు (యూఎస్) మనం భయపడతామని భావించారు. కానీ ఇది నేటి భారత్, ఇది ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని” చౌహాన్ తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ ఉత్పత్తులను (agricultural products) దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలనే డిమాండ్లను తాము అంగీకరించలేదని తెలిపారు. సోమవారం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ 12వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    Union Minister Shivraj | జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట

    ఇది ఆధునిక భారతదేశమని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయదని చౌహాన్ అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం నిర్ణయం తీసుకుందని, రైతులు, మత్స్యకారుల (farmers and fishermen) ప్రయోజనాలపై రాజీ పడదన్నారు. “ప్రపంచం (యూఎస్) మీరు మాతో ఏకీభవిస్తున్నారని చెప్పింది. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులకు మన ద్వారాలు తెరవాలని కోరుకున్నారు. వారు వేలాది హెక్టార్ల భూమిలో పండిన జన్యుమార్పిడి విత్తనాలతో వ్యవసాయం చేస్తారు. సబ్సిడీలు పొందుతారు. ఈ క్రమంలో తలెత్తే పోటీని మన చిన్న రైతులు తట్టుకోలేరు. అందుకే తాము జీఎం విత్తనాలను భారత్​లోకి అనుమతించ లేదు” అని చౌహాన్ తెలిపారు.

    Union Minister Shivraj | స్వదేశీ ఉత్పత్తులనే కొనండి..

    రోజువారీగా ఉపయోగించేందుకు స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 144 కోట్ల మంది ప్రజలకు విజ్ఞప్తి చేశారన్న చౌహన్.. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. దిగుమతి చేసుకున్న వస్తువులను ప్రశంసించే మనస్తత్వాన్ని ఆయన విమర్శించారు. భారతదేశంలో అపారమైన ప్రతిభ, బలమైన శ్రామిక శక్తి ఉందని చౌహాన్ అన్నారు. “దేశంలో పుష్పక్ వైమానిక వాహనం ఉంది, దాని గురించి (రామాయణంలో) ప్రస్తావించబడింది” అని ఆయన పేర్కొన్నారు.

    Latest articles

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    More like this