ePaper
More
    HomeతెలంగాణRation Dealers | సెప్టెంబర్​ 1 నుంచి రేషన్​ పంపిణీ బంద్​ చేస్తాం.. డీలర్ల హెచ్చరిక

    Ration Dealers | సెప్టెంబర్​ 1 నుంచి రేషన్​ పంపిణీ బంద్​ చేస్తాం.. డీలర్ల హెచ్చరిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Dealers | రాష్ట్ర వ్యాప్తంగా రేషన్​ డీలర్లు (Ration Dealers) ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రాల్లో సోమవారం నిరసన తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎర్రమంజిల్‌ పౌరసరఫరాల భవన్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

    తమ సమస్యలు పరిష్కరించాలని రేషన్​ డీలర్లు కోరారు. లేకపోతే సెప్టెంబర్​ 1 నుంచి రేషన్ (Ration)​ పంపిణీని బహిష్కరిస్తామన్నారు. ఐదు నెలలుగా కమీషన్ (Commission)​ రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్​ కమీషన్​ డబ్బులు చెల్లించాలని డిమాండ్​ చేశారు. తమకు నెలకు గౌరవ వేతనం రూ.5వేలు ఇవ్వాలని కోరారు. నెలకు రూ.35 కోట్ల చొప్పున రూ.175 కోట్లు బకాయిలు తక్షణమే చెల్లించాలన్నారు.

    Ration Dealers | హామీలు అమలు చేయాలి

    ఐదు నెలల కమీషన్​ ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని రేషన్​ డీలర్లు వాపోయారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినట్లు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చెల్లించాలన్నారు. కమీషన్​ పెంచాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో నిరసన (Protest) తెలిపి కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

    Ration Dealers | దొడ్డు బియ్యం వాపస్​ తీసుకోవాలి

    రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్​ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం అలాగే ఉండిపోయింది. 5 నెలలుగా దొడ్డు బియ్యాన్ని వాపస్ తీసుకోకపోవడంతో ముక్కి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

    Latest articles

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    Raghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ...

    More like this