ePaper
More
    HomeతెలంగాణMedical College | ర్యాగింగ్​కు పాల్పడిన విద్యార్థుల సస్పెన్షన్​

    Medical College | ర్యాగింగ్​కు పాల్పడిన విద్యార్థుల సస్పెన్షన్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Medical College | నిజామాబాద్​ మెడికల్​ కళాశాల (Nizamabad Medical College)లో జూనియర్​ను ర్యాగింగ్​ (Raging) చేసిన విద్యార్థులు సస్పెన్షన్​కు గురయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్​ కృష్ణమోహన్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఇంటెన్స్​ను ఆరు నెలలపాటు సస్పెన్షన్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్​ ఘటనపై ప్రిన్సిపల్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ (Anti Raging) కమిటీ సోమవారం ఉదయం సమావేశమైన విషయం తెలిసిందే. ఘటనపై ఇరువర్గాల వాదనలను వినడంతో పాటు జుడా మెంబర్​తో మాట్లాడిన అనంతరం సస్పెండ్​ చేశారు. అంతేకాకుండా తదుపరి చర్యలపై పోలీస్ శాఖ సమర్పించిన నివేదిక మీద చర్యలు తీసుకోనున్నారు. యాంటీ ర్యాగింగ్​ కమిటీ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, డీసీపీ, జీజీహెచ్​ సూపరింటెండెంట్​, అడిషనల్ సూపరింటెండ్​, వైస్ ప్రిన్సిపల్, అకడమిక్, డ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధిపతులు హాజరయ్యారు.

    Medical College | అసలు ఏం జరిగిందంటే?

    పటాన్​చెరుకు చెందిన రాహుల్​ రెడ్డి ప్రస్తుతం మెడికల్​ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్​ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్​ హాస్పిటల్​లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్​ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్​ అయిన సాయిరాం పవన్​ రిజిస్టర్​లో నమోదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాకుండా శనివారం సాయంత్రం మాట్లాడుదామని పిలిపించి సీనియర్లు దాడి చేశారు. పలువురు విద్యార్థులు రాహుల్​ను ర్యాగింగ్​ చేయడంతో పాటు బెదిరించారు.

    Medical College | కేసు నమోదు

    బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు నగరంలోని వన్​ టౌన్​ పోలీసులు (One Town Police) ఆదివారం కేసు నమోదు చేశారు. సాయిరాం పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యతో పాటు పలువురు రాహుల్​పై దాడి చేశారు. ఈ మేరకు పోలీసులు BNS 292, 115(2), 131 సెక్షన్లతో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4(1), 4(11) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ర్యాగింగ్​కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్​ చేశారు.

    Latest articles

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    Raghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ...

    More like this