అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sub-Registrar | రిజిస్ట్రేషన్ల శాఖ (Registration Department) ఎన్నిరకాల పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా సబ్ రిజిస్ట్రార్ల ( sub-registrars) తీరు మాత్రం మారట్లేదు. ఇటీవల పలువురు సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి చిక్కారు. మరికొందరు ఇష్టారాజ్యంగా డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో (Armoor Sub-Registrar office) నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఓ డాక్యుమెంట్ క్యాన్సిలేషన్ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది.
ఆర్మూర్ పట్టణానికి (Armoor town) చెందిన ఓ వ్యక్తి 2024లో 4,350 గజాల తన స్థలాన్ని ముగ్గురు వ్యక్తులకు జీపీఏ చేశాడు. దాదాపు రూ. నాలుగైదు కోట్లు విలువల చేసే ఈ స్థలాన్ని ముగ్గురు వ్యక్తులు జీపీఏ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. సదరు జీపీఏ డాక్యుమెంట్ (GPA document) తాజాగా ఉన్నఫలంగా రద్దయ్యింది. ఈ విషయమై ముగ్గురు హక్కుదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆరాతీయగా అసలు విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు.
Sub-Registrar | హక్కుదారులు లేకుండానే క్యాన్సిలేషన్..
రిజిస్ట్రేషన్ల శాఖ నియమ నిబంధనల ప్రకారం.. ఏదైనా డాక్యుమెంట్ ఒకసారి జరిగితే తిరిగి ఇష్టారాజ్యంగా కాన్సిలేషన్ చేయడానికి వీలుండదు. అమ్మిన వారు, కొన్న వ్యక్తులు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. సబ్ రిజిస్ట్రార్లు, ఆపై స్థాయి అధికారులకు (higher-level officers) సైతం క్యాన్సిలేషన్‌కు సంబంధించి ఎలాంటి అధికారాలు లేవు. కానీ, ఆర్మూర్ కార్యాలయంలో మాత్రం సబ్ రిజిస్ట్రార్ మహేందర్ రెడ్డి (Sub-registrar Mahender Reddy) నిబంధనలకు విరుద్ధంగా జీపీఏ డాక్యుమెంట్‌ను క్యాన్సిల్ చేయడం అక్రమానికి అద్దం పడుతోంది.
ఈ ఏడాది జులై 5వ తేదీన బుక్ 1లో నమోదు చేసి డాక్యుమెంట్ నంబరు 4205/2025 పేరిట భూమి క్యాన్సిలేషన్ జరిగినట్లు దస్తావేజు పూర్తి చేశారు. నిజానికి గతంలో బుక్ 1లో వివరాలు నమోదై జీపీఏ హక్కులు కలిగి ఉన్న వారు లేకుండానే.. కేవలం గతంలో జీపీఏ చేసిన వ్యక్తితో క్యాన్సిలేషన్ చేయడం గమనార్హం. ఈ విషయమై సంబంధిత వ్యక్తులు కార్యాలయంలో ఆరాతీసినా, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానిక కాంగ్రెస్ నేత (local Congress leader) అండతోనే ఈ తంతు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం బయటకు పొక్కకుండా పెద్దఎత్తున నగదు చేతులు మారినట్లు సమాచారం. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన డీఐజీ కార్యాలయం అధికారులు సైతం ముడుపులు తీసుకుని మౌనం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ వ్యవహారం రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ వరకు వెళ్లిందా..? లోలోపలే తొక్కిపెట్టారా..? అన్నది అంతుచిక్కని విషయం.