అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Trap | ప్రభుత్వ కార్యాలయంలో పని జరగాలంటే మామూళ్లు ముట్టాజెప్పాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. పని కోసం వచ్చిన ప్రజలను లంచాల కోసం కొందరు అధికారులు పట్టి పీడిస్తున్నారు. నిత్యం రాష్ట్రంలో ఒకరిద్దరు అధికారులు అనిశాకు పట్టుబడుతున్నా అవినీతి పరుల్లో మార్పు రావడం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరని ధీమాతో లంచాలు అడుగుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. పలువురు అటెండర్ల నుంచి మొదలు పెడితే ఉన్నతాధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ.. వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు.
కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు(Assistant Director Narasimha Rao) సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. యూరియా అమ్మకాలపై ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఉపసంహరణ కోసం సదరు అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అనిశా అధికారులను(Anisha Officers) సంప్రదించాడు. ఈ క్రమంలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులెవరికీ లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు(ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగినట్లయితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.